Site icon Prime9

Tirumala: అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల్లో తిరుమలది రెండవ స్థానం.. మరి ఫస్ట్ ప్లేస్ ఏ దేవాలయానికంటే..?

Vijay Govindam

Vijay Govindam

Tirumala: ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించే వివిధ ప్రసిద్ధ యాత్రా స్థలాలను సర్వే చేసింది.

ఈ సర్వేలో వారణాసి మొదటి స్థానంలో నిలవగా, తిరుమల రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య వేగంగా పెరిగింది. తిరుపతిలో గత ఏడాదితో పోలిస్తే యాత్రికులు బుక్ చేసుకున్న గదులు 238 శాతం పెరిగాయని సంబంధిత అధికారులు తెలిపారు.

1950 నుండి తిరుమల సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరిగింది. అధికారిక నివేదికల ప్రకారం రోజుకు 30,000 నుండి 40,000 మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారు. ఇప్పుడు ఈ సంఖ్య రోజుకు 80,000 నుండి లక్ష మందికి చేరుకుంది. భక్తులు సమయ స్లాట్‌లు, సర్వదర్శనం, సిఫార్సుల ఆధారంగా దర్శనం మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వివిధ సేవల్లో పాల్గొంటున్నారు. గత తొమ్మిది నెలల్లో తిరుమల హుండీ కలెక్షన్ రూ.100 కోట్లు దాటింది.

Exit mobile version