Vande Bharat trains: రైల్వే శాఖ దక్షిణ భారతదేశంలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులుతెలిపారు.
కాచిగూడ -బెంగళూరు, సికింద్రాబాద్ -తిరుపతి, సికింద్రాబాద్ -పూణే మధ్య ఈ వందేభారత్ రైళ్లు తిరుగుతాయని వారు అన్నారు.
మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ ఏడాది నవంబర్‌లో చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు.
బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఐదవ రేక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
ఇటీవల ప్రారంభించిన సికింద్రాబాద్-వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది.
వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు విజయవాడ డివిజన్‌లలో కనీసం ఒక కోచింగ్ డిపోలో
మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే డివిజన్‌లను కోరినట్లు వ సంబంధిత వర్గాలు తెలిపాయి.
టార్గెట్ 75 వందేభారత్ రైళ్లు..(Vande Bharat trains)
భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను మరియు రాబోయే మూడేళ్లలో 400 రైళ్లను నడపాలని యోచిస్తోంది.
ప్రస్తుతానికి, నాగ్‌పూర్-బిలాస్‌పూర్, ఢిల్లీ-వారణాసి, గాంధీనగర్-ముంబై మరియు చెన్నై-మైసూరుతో సహా వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి.
ఫ్లాగ్‌షిప్ మేక్-ఇన్-ఇండియా ఇనిషియేటివ్ కింద చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తయారు చేసారు.
దక్షిణాదిపై బీజేపీ నజర్ ..
బీజేపీ తన మిషన్ సౌత్ కింద 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో, ఆంధ్రప్రదేశ్‌లో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
అందువలన ఈ ప్రాంతంలో వందే భారత్ రైళ్లను ప్రారంభించి వాటిని ప్రచారం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
అదేవిధంగా న్యూ ఢిల్లీ -జైపూర్ ల మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు ప్రారంభమవుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఇది రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని నాలుగు గంటల నుండి రెండు గంటలకు తగ్గిస్తుంది.
వందే భారత్ అద్భుతమైన రైలు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ ను ఒక అద్భుతమైన రైలుగా అభివర్ణించారు.
ఇది 52 సెకన్లలో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
ప్రపంచంలోని ఇతర రైళ్లు ఇదే దూరానికి 54 నుండి 60 సెకన్లు తీసుకుంటాయి.
ఇది చాలా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవమని అన్నారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 14 ఎసి చైర్ కార్ కోచ్‌లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఎసి చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.
ఈ రైలులో 1,128 మంది ప్రయాణించవచ్చు.
రాబోయే మూడేళ్ళలో400 వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/