Site icon Prime9

Earthquake: మూడు రోజులు.. మూడు రాష్ట్రాల్లో భూకంపాలు

earthwuake

earthwuake

Earthquake: దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. ఇది వరకే.. అస్సాం, గుజరాత్ లో స్వల్ప ప్రకంపనలు రాగా.. తాజాగా సిక్కింలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. టర్కీ, సిరియాలో భూకంపం భారీ చోటు చేసుకుంది. దీంతో భారత్‌లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు.

మూడు రోజులు.. మూడు రాష్ట్రాల్లో (Earthquake)

దేశంలో వరుస భూకంపాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టర్కీ, సిరియా ప్రళయాన్ని మరవకముందే.. భారత్ లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం.. గుజరాత్ లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఆ తర్వాతి రోజు.. అస్సాంల భూప్రకంపనలు వచ్చాయి. తాజాగా సోమవారం సిక్కింలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.3 గా నమోదైంది. సిక్కింలోని యుక్‌ సోం ప్రాంతంలో ఇది సంభవించినట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఉదయం నాలుగు గంటల సమయంలో.. భూకంపం వచ్చినట్లు తెలిపింది. అస్సాంలో వచ్చిన భూకంపం తీవ్రత 4.0 కాగా.. గుజరాత్ లో 3.8 తీవ్రత నమోదైంది.

దేశంలో భూకంపం ముప్పు ఎంత?

భారత దేశంలో సుమారు 60 శాతం భూభాగం.. భూకంపం ముప్పు జోన్ లో ఉందని కేంద్రం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022లో తెలిపింది. దేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఐదో జోన్ అత్యంత ప్రమాదకరమని.. రెండో జోన్ అత్యంత స్వల్ప తీవ్రత ఉంటుందని తెలిపింది.

ఐదవ జోన్ లోని ప్రాంతాలివే..

ఈ జోన్ అత్యంత ప్రమాదకరమైనంది. ఇక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. దేశంలో 11శాతం భూభాగం ఈ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి అత్యధికంగా రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9శాతం కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జోన్ లోని ప్రాంతాలు.. కశ్మిర్ లోని కొన్ని ప్రాంతాలు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌ లోని పశ్చిమ భాగం.. ఉత్తరాఖండ్‌ తూర్పు ప్రాంతం ఈ పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు గుజరాత్‌లో రాణ్‌ ఆఫ్‌ కచ్.. ఉత్తర బిహార్ సహా ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయి.

జోన్‌ 4 ప్రాంతాలివే..

నాల్గవ జోన్ లో భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ జోన్‌ ప్రాంతాల్లో రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.0 వరకు వచ్చే అవకాశం. దేశ భూభాగంలో ఇది 18శాతం ఉంటుంది.
కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్, పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు ఇందులోకి వస్తాయి. ఢిల్లీ, సిక్కిం, యూపీ ఉత్తర ప్రాంతం, బిహార్‌, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు.

జోన్‌ 3 ప్రాంతాలు.. తీవ్రత

మూడవ జోన్ లో ముప్పు శాతం మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడ వచ్చే భూకంపాల తీవ్రత 7శాతం వరకు ఉంటుంది. దేశంలో మూడవ జోన్ కి చెందిన భూభాగం 31శాతంగా ఉంది. ఈ మూడవ జోన్ లో కేరళ, గోవా, లక్షద్వీప్‌ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణా ప్రాంతాలు ఉన్నాయి. అలాగే గుజరాత్‌లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌ లో మిగిలిన ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు జోన్‌ 3లోకి వస్తాయి

జోన్‌ 2 ప్రాంతాలు..

ఈ జోన్ లో భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువ.. ఇక్కడ దీని తీవ్రత.. 6శాతం లేదా దానికంటే తక్కువగా నమోదవుతుంది. దేశ భూభాగంలో ఇది 40శాతంగా ఉంది. రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. దీనిని సురక్షితమైన జోన్ గా వర్ణిస్తారు.

Exit mobile version