Mughal Garden: మెుఘల్ గార్డెన్ పేరు మార్పు వెనుక కారణం ఇదేనా?

Mughal Garden: రాష్ట్రపతి భవన్ లో మెుఘల్ గార్డెన్ కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఇక్కడి అందాలు.. గార్డెన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. ఇంతటి చరిత్ర కలిగిన మెుఘల్ గార్డెన్ పేరును కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మార్చింది.

Mughal Garden: రాష్ట్రపతి భవన్ లో మెుఘల్ గార్డెన్ కు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఇక్కడి అందాలు.. గార్డెన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. ఇంతటి చరిత్ర కలిగిన మెుఘల్ గార్డెన్ పేరును కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మార్చింది. ఇక నుంచి మెుఘల్ గార్డెన్ పేరును.. అమృత్ ఉద్యాన్ పేరుతో పిలవనున్నట్లు కేంద్రం తెలిపింది. పేరు మార్చుతూ
రాష్ట్రపతి భవన్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.

పేరు మార్పుకు కారణం ఇదేనా

కేంద్ర ప్రభుత్వం ఈ పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి చెందిన ఈ ఉద్యానవనానికి అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చింది.

75 వసంతాల భారవతనిని దృష్టిలో ఉంచుకుని ఈ పేరు మార్చినట్లు తెలుస్తోంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యాచరణలో భాగంగా.. మొఘల్ గార్డెన్స్ (Mughal Garden) పేరును ఇలా అమృత్ ఉద్యాన్ గా మార్చినట్లు సమాచారం.

ఈ పేరు మార్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా తెలిపారు.

పేరు మార్పు అనంతరం.. ప్రజల సందర్శన కోసం ఈ గార్డెన్ ను తెరిచి ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు ఈ గార్డెన్ లోకి ప్రజల సందర్శనకు అవకాశం ఉంటుందని.. రాష్ట్రపతి భవన్ తెలిపింది.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిగా వికసించిన పూలతో.. ఈ ఉద్యానవనం మరింత అందంగా ఉంటుంది.

రంగురంగుల పూలతో పాటు.. ఆహ్లాదాన్ని ఈ గార్డెన్ అందిస్తుంది.

మెుఘల్ గార్డెన్ చరిత్ర ఇదే

ఈ గార్డెన్ కు ఓ చరిత్ర ఉంది. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ కు ఇష్టమైన తోటగా దీన్ని చరిత్రకారులు అభివర్ణించారు. ఆ కాలంలో దీనిని బాగ్, బగీచా అని పిలిచేవారు.

ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న రామ్ బాగ్ మొట్టమొదటిది. దీనినే చార్ బాగ్ అని పిలిచేవారు. మనదేశంలోనే కాకుండా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూడా మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి.
ఈ తోటల ప్రస్థావన బాబర్, హుమాయూన్, అక్బర్ ల జీవిత చరిత్రలలోనూ ఉంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/