Rajasthan: రాజస్థాన్‌లో ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుండగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న జిల్లాకలెక్టర్ ను సమావేశం నుంచి బయటకు పొమ్మని మంత్రి ఆదేశించారు. సోమవారం బికనీర్‌లోని రవీంద్ర మంచ్‌లో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రమేష్ మీనా సమావేశమయ్యారు. అనంతరం మీనా మాట్లాడుతండగా= కలెక్టర్ మొబైల్‌లో మాట్లాడుతున్నారు. దీనితో ఆగ్రహం చెందిన మంత్రి మీనా కలెక్టర్ భగవతి ప్రసాద్ కలాల్ ను బయటకు పొమ్మన్నారు. అనంతరం మీనా మాట్లాడుతూ అధికారులే ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. ఏ అధికారి వల్లనైనా ప్రభుత్వ పథకాల్లో పనులు జరగకుంటే ఊరుకునేది లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రతాప్‌సింగ్ ఖాచరియావాస్ కూడ తమ శాఖలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారుల ఏసీఆర్‌ల (యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు) ను నింపే హక్కు మంత్రులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏసీఆర్ నింపే పనిని ముఖ్యమంత్రి స్వయంగా చేయవద్దని, ఆ శాఖ మంత్రికి అప్పగించాలన్నారు. గత వారం దౌసాలో జరిగిన సమావేశంలో వైద్యశాఖ మంత్రి పర్సాది లాల్ మీనా కూడా అధికారులతీరుపై విమర్శలు గుప్పించారు.