Site icon Prime9

Prime Minister Modi: కర్ణాటక ప్రభుత్వాన్ని దోపిడీ గ్యాంగ్ నడిపిస్తోంది.. ప్రధాని మోదీ

Prime Minister Modi

Prime Minister Modi

Prime Minister Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక అధికార కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని దోపిడీ గ్యాంగ్‌ నడిపిస్తోందన్నారు. బెంగళూరు టెక్‌ హబ్‌.. దీన్ని కాస్తా కాంగ్రెస్‌ పార్టీ ట్యాంకర్‌ హబ్‌ గా మార్చిందని మండిపడ్డారు. కర్ణాటకలో 2జీ స్కామ్‌ లాంటి కుంభకోణాలు చేయాలని కలలు కంటున్నారని ప్రధాని మోదీ రాష్ర్టంలోని బాగల్‌ కోట్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు. తనకు రాష్ర్టప్రభుత్వం నుంచి కీలక సమాచారం అందిందని… కేంద్రప్రభుత్వానికి కూడా ఆ సమాచారం తెలుసు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎదుర్కొబోతోందన్నారు. దేశ ప్రజలందరికి తెలుసు.. కాంగ్రెస్‌ ఆయి..తబాహి లాయి అంటే… కాంగ్రెస్‌ వస్తే విధ్వంసమే అని ప్రధాని అన్నారు.

కర్ణాటకను ఏటీఎంగా మార్చారు..(Prime Minister Modi)

ఇటీవల ముగిసినఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అలివిగాని హామీలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కర్నాటకను ఏటీఎంగా మార్చింది. కేవలం కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కర్ణాటక ట్రెజరీని ఖాళీ చేసింది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎమ్మెల్యేలకు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనులకు కావాల్సిన నిధులను నిలిపివేసింది. రాష్ర్టంలో శాంతి భద్రతల పరిస్థితులు దారుణంగా తయారయ్యయాని సిద్దరామ్యప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుబ్బాలీలో మన కూతురును ఓ వ్యక్తి పలుమార్లు కత్తితో పొడికి చంపితే .. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బాలిక క్యారెక్టర్‌పై లేనిపోని అభండాలు వేశారు. షాపు యజమాని తన షాపులో హనుమాన్‌ చాలీసా చదివితే అతనిపై దాడి చేయడం ఏంటని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇక కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీపై ప్రధాని విరుచుకుపడ్డారు. ప్రజలకు సేవ చేయాలనే యావ యువ కాంగ్రెస్‌ నాయకుడికి లేదన్నారు. తరచూ విదేశాల్లో విహార యాత్రలు చేసేవారు అభివృద్ది పనులను ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే విధ్వంసమే.. అదే భారతీయ జనతాపార్టీకి వేస్తే దేశాన్ని ఆర్థికంగా అభివృద్దిలో పథంలో తీసుకువెళ్తామన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను మూడో స్థానంలో నిలుపుతామన్నారు మోదీ. మేకిన్‌ ఇండియాను తయారీ రంగంలో హబ్‌ చేస్తామన్నారు. స్కిల్‌ ఇండియాను బలోపేతం చేస్తామన్నారు. విదేశాల్లో విహార యాత్రలకు వెళ్లే వారికి ఓటు వేస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చరని ప్రధాని రాహుల్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటకలో రెండవ విడత 14 సీట్లకు గాను మే 7న పోలింగ్‌ జరుగనుంది.

Exit mobile version