Site icon Prime9

Rahul Gandhi: ఆ సమయంలో ఉగ్రవాదులు నన్ను చంపేసేవారు- రాహుల్‌ గాంధీ

rahul gandhi

rahul gandhi

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో జరిగిన అనుభవాలను రాహుల్ గాంధీ పంచుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో యాత్ర చేస్తున్నప్పుడు తాను ఉగ్రవాదులను చూశానని అన్నారు. ఆ సయమంలో తాను సమస్యల్లో ఉన్నట్లు తెలిసిందని తెలిపాడు. ఆ సంఘటనను తాజాగా గుర్తుచేసుకున్నారు.

భయానక అనుభవం ఎదురైంది.. (Rahul Gandhi)

భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో.. భయానక అనుభవం ఎదురైనట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. దాదాపు ఐదు నెలల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. జమ్మూకశ్మీర్‌ లో యాత్ర సమయంలో అనుకోని సంఘటన ఎదురైనట్లు తన అనుభవాన్ని పంచుకున్నారు. జోడో యాత్ర సమయంలో ఉగ్రవాదులు తనను చంపేసేవారే అని రాహుల్ తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టారు.

లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. 21వ శతాబ్దంలో లెర్నింగ్‌ టు లిజన్‌ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా జోడో యాత్ర రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. అక్కడ పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది సూచించారు. కానీ మా పార్టీవాళ్లతో మాట్లాడి.. యాత్రలో ముందుకెళ్లడానికే నిశ్చయించుకున్నా. గుర్తుతెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలని చెప్పాడు. ఆ వ్యక్తి.. కొంతమందిని చూపిస్తూ వాళ్లంతా ఉగ్రవాదులు అని చెప్పాడు. ఆ సమయంలో నేను నిజంగానే ప్రమాదంలో ఉన్నట్లు తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో ఆ ముష్కరులు నన్ను చంపేసేవారే. కానీ అలా చేయలేదు. లిజనింగ్‌కు ఉన్న శక్తి అది అంటూ రాహుల్‌ ఆ సంఘటనను వివరించారు. ప్రజా సమస్యలు వినడానికి వచ్చానన్న కారణంతోనే వాళ్లు తనపై దాడి చేయలేదన్న అభిప్రాయాన్ని రాహుల్‌ వ్యక్తం చేశారు.

భారత ప్రజాస్వామ్యంపై దాడి

లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్లపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు. ఇది భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయటమేనని రాహుల్ అన్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారతదేశ ప్రజాస్వామ్య మూల స్వరూపం ఇరకాటంలో పడిందని మండిపడ్డారు. తన ఫోన్లోకి పెగాసస్‌ జొప్పించారని.. చాలా మంది నేతల ఫోన్లపై నిఘా పెట్టారని రాహుల్ ఆరోపించారు. దీనిపై ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి తనకు సమాచారం వచ్చిందని వివరించారు. పార్లమెంట్‌, స్వేచ్ఛాయుత మీడియా, న్యాయవ్యవస్థను నిర్బంధిస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్య మూల స్వరూపం ప్రమాదంలో ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌ ఇటీవల లండన్‌ వెళ్లారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో ఆయన బిగ్‌ డేటా, భారత్‌-చైనా సంబంధాలపైనా ప్రసంగాలు చేశారు.

Exit mobile version