Kerala Road Accident: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం మనంథావాడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా వయనాడ్‌కు చెందిన వాళ్లని.. టీఎస్టేట్‌లో పని చేసే కూలీలుగా నిర్ధారణ అయ్యింది. 25 మీటర్ల లోయలో అతి వేగంగా జీపు పడడంతో.. అది రెండు ముక్కలైంది. మృతదేహాలను వయనాడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు.. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.ఓ ప్రైవేట్ టీ ఎస్టేట్‌లో పనిచేసే మహిళలతో జీపు మక్కిమలకు తిరిగి వస్తోందని స్థానికులు మీడియాకు తెలిపారు. బాధితులను మనంతవాడిలోని ఆసుపత్రికి తరలించగా వారిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు., కోజికోడ్‌లో ఉన్న అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రమాద స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స సహా అన్ని చర్యలను సమన్వయం చేయాలని, ఇతర అవసరమైన పనులను చేపట్టాలని సిఎం ఆదేశాలు ఇచ్చారని సిఎంఓ తెలిపింది.
ఈ విషాద సంఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లోచాలా మంది తేయాకు తోటల కార్మికుల ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన జీపు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. జిల్లా అధికారులతో మాట్లాడి, వేగంగా స్పందించాలని కోరాను. దుఃఖంలో ఉన్న కుటుంబాలు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.