Site icon Prime9

Income Tax: వారికి శుభవార్త.. పన్ను చెల్లింపుదారులకు గడపు పెంపు

income tax returns

income tax returns

Income Tax: పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖకు రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి. కాగా పన్ను కట్టడానికి ప్రభుత్వం ఒక గడువును నిర్ణయిస్తుంది. ఆ గడువులోగా పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి గానూ పన్ను చెల్లింపు గడువును పెంచింది.
కంపెనీలు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఎటువంటి పెనాల్టీ లేకుండానే నవంబర్ 7 వరకు గడవును పొడిగించింది.

కాగా అంతకు ముందు తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన కంపెనీలకు, ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 31గా వెల్లడించిన విషయం విదితమే. అయితే ఆ తేదీ ఇప్పుడు నవంబర్ 7, 2022 వరకు పెంచింది. దేశీయ కంపెనీలు 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను అక్టోబర్ 31, 2022లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు తేదీ నవంబర్ 30, 2022గా పేర్కొనింది.

ఇదీ చదవండి: సింక్ తో సింబాలిక్ గా ట్విట్టర్ ఆఫీస్ కు ఎంట్రీ ఇచ్చిన మస్క్.. వీడియో వైరల్

Exit mobile version