Site icon Prime9

Annamalai: రాజీనామా చేస్తానని.. అంతలోనే మాట మార్చిన అన్నామలై

tamil nadu

tamil nadu

Annamalai: తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో అన్నాడీఎంకే తో కూటమి పై ఓ సారి ఆయన స్పందించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పుడు అదేం లేదంటూ తన మాట మార్చుకున్నాడు.

పొత్తు పెట్టుకుంటే రాజీనామా.. (Annamalai)

ప్రస్తుతం అన్నామలై.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్నారు.

ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా కు వివరిస్తున్నారు.

ఇక తమిళనాడులో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. అధికారాన్ని చేపట్టగలిగే స్థాయికి పటిష్ఠం చేయాలన్నదే తన ఆశయమని అన్నామలై అన్నారు.

అయితే తమిళనాడులో కూటమిగా ఉన్న.. అన్నాడీఎంకే, భాజపా మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. భాజపా కీలక నేతల్ని ఆ పార్టీ తమవైపు లాక్కోవడం పట్ల భాజపా గుర్రుగా ఉంది.

అయిదే దీనిపై అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదు.

దీనిపై కాస్త నిరాశతో ఉన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే.. తన పదవికి రాజీనామా చేస్తానని అన్నామలై ప్రకటించారు.

ఈ స్టేట్ మెంట్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపింది. అయితే దీనిపై ఆయన ఒక్కసారి యూ టర్న్ తీసుకున్నారు.

తమ పార్టీల మధ్య బేధాభిప్రాయాలు ఏమీ లేవని, అన్నాడీఎంకేతో తమ పార్టీ కూటమి పదిలమని తాజాగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లిన ఆయన శుక్రవారం ఉదయం మదురై చేరుకున్నారు.

విమానం దిగిన అనంతరమే మీడియాతో మాట్లాడారు. దిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ నాయకులు పలువురిని కలుసుకుని పార్టీ పరిస్థితులు వివరించానని తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అధికారాన్ని చేపట్టగలిగే స్థాయికి పటిష్ఠం చేయాలన్నదే తన ఆశయమని అన్నామలై అన్నారు. పార్టీలోని సీనియర్‌ నాయకులకు తనకు మధ్య ఎలాంటి వ్యక్తిగత మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు.

Exit mobile version