Site icon Prime9

Sushanth Sing Rajput: సుశాంత్ సింగ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సారా అలీ ఖాన్.. ఎమోషనల్ పోస్ట్

sushanth singh

sushanth singh

Sushanth Sing Rajput: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయిన.. తనకంటూ బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అభిమానులను కోట్లలో సంపాదించుకున్నాడు. ఇక సుశాంత్ సింగ్ మరణం.. బాలీవుడ్ లో కలకలం రేపింది. ఇప్పటికి సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య అంటుండగా.. హత్య అని కొందరు ఆరోపిస్తున్నారు.

ఇక జనవరి 21న సుశాంత్ సింగ్ పుట్టిన రోజు. సుశాంత్ బర్త్ డే ని సహనటి సారా అలీ ఖాన్ సెలబ్రేట్ చేసింది. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన సారా.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణాన్ని ఇప్పటికి సహనటులు.. అభిమానులు మరిచిపోలేకపోతున్నారు.

తన అద్భుతమైన నటన.. చిరునవ్వుతో ఎంతో మంది అభిమానులను సుశాంత్ సంపాదించుకున్నారు.

తను మరణించిన ఇప్పటికి అభిమానుల గుండెల్లో సజీవంగా ఉన్నాడు.

శనివారం సుశాంత్ బర్త్ యానివర్సరీ కాగా.. సారా అలీ ఖాన్ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసింది.

కేక్ కట్ చేసిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. పిల్లలతో కలిసి పాట కూడా పాడిన సారా.. గ్రీన్ కలర్ సూట్‌‌లో సింపుల్‌గా కనిపించింది.

ఈ సెలబ్రేషన్స్ వీడియోను షేర్ చేసిన సారా అలీ ఖాన్.. పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్ అని రాసింది.

ఇతరులను నవ్వించడమంటే నీకు ఎంత ఇష్టమో తెలుసు.. అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.

ఇంకా తన నోట్‌లో.. నువ్వు మా అందరినీ చూస్తున్నపుడు.. చంద్రుడు అమావాస్య చీకట్లను వీడుతున్నాడు అని రాసుకొచ్చింది.

ఈ రోజు కూడా నిన్ను నవ్వించామని ఆశిస్తున్నాను అంటూ.. ఎమోషనల్ అయింది.

ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసినందుకు సునిల్ అరోరాకు ధన్యవాదాలు తెలిపింది సారా.

తనలాంటి వ్యక్తులు సురక్షితమైన, సంతోషకరమైన ప్రదేశంగా మార్చారని.. ఆనందాన్ని పంచుతూ ఉండాలని కోరింది.

ఇక సుశాంత్ పుట్టినరోజును జరిపిన సారాను నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.

కాగా సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. అభిషేక్ కపూర్ తెరకెక్కించిన కేదార్‌నాథ్ చిత్రంలో కలిసి నటించారు. ఇది సారాకు తొలి చిత్రం.
సుశాంత్‌తో డేటింగ్ చేసిన నటి రియా చక్రవర్తి సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఇందులో సుశాంత్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీ కూడా ఉంది.

మరోవైపు నటి పరిణీతి చోప్రా.. సుశాంత్‌ త్రోబాక్ చిత్రాన్ని పంచుకుంటూ ఈ రోజు నిన్నను గుర్తు చేసుకుంటున్నాను సుష్ అని క్యాప్షన్ జోడించింది.

ఇక సుశాంత్ కై పో చే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. MS ధోని, ఛిచోరే వంటి పలు హిట్ చిత్రాలలో నటించాడు.

దర్శకుడు ముఖేష్ ఛబ్రా తెరకెక్కించిన సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారా OTTలో విడుదలైంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar