Site icon Prime9

Article 370: ఆర్టికల్ 370 రద్దును సమర్దించిన సుప్రీంకోర్టు.

Article 370

Article 370

Article 370: జమ్ముకశ్మీర్‌‌కి ప్రత్యేక అధికారాలిచ్చే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు జమ్ముకశ్మీర్ సమానమేనని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..( Article 370)

అయితే ధర్మాసనం మూడు తీర్పులని ఇవ్వడం గమనార్హం. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి మరల్చలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సవాల్ చేయలేరని సుప్రీంకోర్టు తెలిపింది. జమ్ముకశ్మీర్‌కి ఏనాడూ సార్వభౌమాధికారాన్ని ఇవ్వలేని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఆర్టికల్ 370 అన్నది కేవలం తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చింది. కశ్మీర్ విలీనమైనప్పుడు ప్రత్యేక హోదాలేవీ ఇవ్వలేదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎలాంటి సార్వభౌమాధికారం లేదు.దీనికి ఇతర రాష్ట్రాల అధికారాల నుండి వేరుగా అంతర్గత సార్వభౌమాధికారం లేదు.ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం నిర్ణయాన్ని పిటిషనర్లు సవాలు చేయలేరు.70 యొక్క చారిత్రక సందర్భం ఇది తాత్కాలిక నిబంధన అని చూపిస్తుంది. కేంద్రానికి రద్దు చేసే అధికారం ఉంది.ఆర్టికల్ 370 ప్రకారం 370(1)(D)కి వెలుపల ప్రక్రియ ద్వారా సవరించబడదు.ప్రక్రియను దాటవేయడానికి వివరణ నిబంధనను ఉపయోగించలేరు.ఆర్టికల్ 370 ఉనికిలో లేదని రాష్ట్రపతి ఏకపక్ష నోటిఫికేషన్ జారీ చేయవచ్చు దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదు. మరోవైపు సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Exit mobile version