Site icon Prime9

Diwali Crackers: దీపావళి టపాసులు… ఢిల్లీ వాసులకు నొ చెప్పిన సుప్రీంకోర్టు…

Supreme Court says no to people of Delhi to burn Diwali crackers

Supreme Court says no to people of Delhi to burn Diwali crackers

Supreme Court: దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. రెండు రోజుల పాటు టపాకాయలు పేల్చి ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకొంటుంటారు. అయితే టపాకాయల పేల్చేందులో మాత్రం ఢిల్లీ వాసులకు ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బాణసంచాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది.

దీపావళి పండుగ సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యానికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని, అందులో ఈ ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని సుప్రీం పేర్కొనింది. అయితే పండుగ సెలవల మందు మరోమారు సమీక్షిస్తామని కోర్టు పేర్కొనింది. నిషేదాన్ని సవాలు చేస్తూ భాజపా నేత మనోజ్ తివారీ పిటిషన్ పై కోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీలో దీపావళి బాణసంచా ఉత్పత్తి, వినియోగాన్ని 2023 జనవరి 1 వరకు అక్కడి ప్రభుత్వం నిషేదం విధిస్తూ ఆదేశాలు జారీ చేసివుంది. పండుగ సమయంలో ఏటా ఢిల్లీలో వాతావరణం చాలా దారుణంగా మారిపోతుంది. గాలి పూర్తి కులషితమై, పొగతో నిండిపోయి శ్వాస కూడా తీసుకోవడానికి పనికి రాకుండా ఉంటున్న తరుణంలో ప్రభుత్వం నిషేదం నిర్ణయం తీసుకొనింది. కాలుష్య స్థాయిని తగ్గించి ప్రజలకు సౌకర్యవంతమైన గాలిని అందించడమే ప్రధాన ఉద్ధేశం.

ఇది కూడా చదవండి:POCSO Court: సంచలన తీర్పునిచ్చిన విజయవాడ పోక్సో కోర్టు

Exit mobile version