Site icon Prime9

Supreme Court: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Supreme Court: ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌కు బదిలీ చేశారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం సీజేఐ. కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసి పెట్టింది. అర్జంట్‌గా బెయిల్‌ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో జ్యూడిషియల్‌ కస్టడీలో 50 రోజుల పాటు జైలులో ఉండి ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.

ఇదిలా ఉండగా కేజ్రీవాల్‌ను ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరడం  దీనికి సుప్రీంకోర్టు అంగీకరించి జూన్‌ 1 వరకు బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2వ తేదీన స్వచ్చందంగా లొంగిపోవాలని ఆదేశించింది. ఇక బెయిల్‌పై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి ప్రభుత్వం కార్యకలాపాల్లో పాల్గొనరాదని.. అలాగే ప్రభుత్వం ఫైల్స్‌పై సంతకాలు చేయరాదని షరతు విధించింది సుప్రీంకోర్టు.

సీజేఐ నిర్ణయం తీసుకుంటారు..(Supreme Court)

అయితే కేజ్రీవాల్‌ తరపున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ పిటిషన్‌ జాప్యం చేయడానికి గల కారణాల గురించి ప్రశ్నించారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపు పిటిషన్‌పై సీజేఐ చంద్రచూడ్‌ నిర్ణయం తీసుకుంటారని ప్రకటించింది. ఇక కేజ్రీవాల్‌ తన ఆరోగ్యం బాగా లేదని కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని.. దానికి తనకు మరో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ పొడిగించాలని కోరారు. ఎలాంటి కారణం లేకుండా తన బరువు ఒక నెలలో ఏడు కిలోలు తగ్గిందని, ఒక వారంలోగా పలు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారని కేజ్రీవాల్‌ భటిండాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. కాగా కేజ్రీవాల్‌ తిహార్‌ జైలు నుంచి ఈ నెల 10వ తేదీన విడుదల అయ్యారు. సుమారు 50 రోజుల పాటు కస్టడీలో ఉన్న తర్వాత ఎన్నికల్ల ప్రచారం చేసుకోవడానికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

 

Exit mobile version