Site icon Prime9

Supreme Court: గవర్నర్‌ నిర్ణయం తప్పే.. ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం: సుప్రీం

Hate speech is wrong..Supreme Court

Hate speech is wrong..Supreme Court

Supreme Court: మహారాష్ట్ర రాజకీయంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ సంక్షోభం సమయంలో.. గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. అలాగే ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని తిరిగి నియమించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యనించింది.

సుప్రీం కీలక వ్యాఖ్యలు.. (Supreme Court)

మహారాష్ట్ర రాజకీయంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ సంక్షోభం సమయంలో.. గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. అలాగే ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని తిరిగి నియమించలేమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యనించింది.

శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది. దీంతో షిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు ఈ పిటిషన్ ను విచారించారు. ఇదే సమయంలో.. మహరాష్ట్ర సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది.
రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది.

గవర్నర్ విచక్షణాధికారాలను అమలు చేసిన తీరును న్యాయస్థానం తప్పుపట్టింది.

ఠాక్రే మెజార్టీ కోల్పోయారని.. గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనపుడు మెజర్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని పిలవడం సమంజసం కాదని తెలిపింది.

పార్టీలో ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు.. బలపరీక్షను మాధ్యమంగా వాడలేమని కోర్టు తెలిపింది.

బలపరీక్షకు ముందే ఉద్దవ్ రాజీనామా చేశారు. అయితే బలపరీక్ష ఎదుర్కొకుండానే.. రాజీనామా చేయడం కూడా సరికాదంది.

దీంతో ఠాక్రే ప్రభుత్వాన్ని తిరిగి నియమించలేమని తెలిపింది.

షిందే, అయన వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ వర్గం ఫిర్యాదు చేసింది.

అయితే ఇది తేలకుండానే.. నాటి గవర్నర్.. షిందే తో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ విషయాన్ని ఉద్దవ్ వర్గం ప్రశ్నిచింది. అయితే ఈ ఎమ్మెల్యేలపై ఇపుడు అనర్హత వేటు వేయలేమని సుప్రీం పేర్కొంది.

అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌కు.. రెబల్‌ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా.

లేదా అన్న అంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని చెప్పింది.

Exit mobile version