Prime9

Supreme Court: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

Amaravathi Case: ఓ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సీరియస్ అయింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దంటూ ధర్మాసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చురకలంటించింది.

వివరాల్లోకి వెళ్లితే, అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్‌, ఇన్న‌ర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో నారాయ‌ణ‌కు హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనల క్రమంలో ఆర్థిక నేరాల‌తో కూడిన కేసు అని, నిందితులు సీఐడీ విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు.

విచారణకు సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సూచించింది. ప్రతీ చిన్న దానికి సుప్రీంకోర్టుకు రావడం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బెయిల్ రద్దుపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ఇది కూడా చదవండి:  #ChandrababuNaidu: వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. చంద్రబాబు నాయుడు

Exit mobile version
Skip to toolbar