Kochi police: మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు ప్రయాణించే వారిని సైతం రిస్క్ లో పెడుతున్నారు. నిత్యం మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నా.. వారు పట్టించుకోవడం లేదు. ఇక మద్యం సేవించి.. వాహనం నడిపిన 16 మంది బస్సు డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష విధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు..(Kochi police)
మద్యం మత్తులో బస్సులు నడిపిన 6 మంది డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష విధించారు. పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి.. వారి చేత వెయ్యి సార్లు ఇంపోజిషన్ రాయించారు. ఇంపోజిషన్ తర్వాత వదిలేస్తారని అనుకుంటున్నారా.. అది పొరపాటే. ఇంపోజిషన్ తో పాటు.. నిబంధనలు అతిక్రమించినందుకు గాను అసలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే సూచిస్తారు. అయినా వారి హెచ్చరికలను పట్టించుకోకుండా యథేచ్చగా తాగి వాహనాలు నడుపుతున్నారు. అలాంటి వారికి ఫైన్లు.. ఒక్కోసారి జైలు శిక్షలు పడుతుండటం మనం చూస్తున్నాం. శిక్షలు పడినా.. ఫైన్ కట్టినా వారు మద్యం తాగి వాహనం నడపడం మానలేదు. ఇలాంటి వారితో విసిగిపోయిన పోలీసులు.. మందుబాబులకు షాకిచ్చారు. వాహన తనిఖీల్లో భాగంగా.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి వింత పరీక్ష పెట్టారు. వారి చేత వెయ్యి సార్లు ఇంపోజిషన్ రాయించారు.
హై కోర్టు ఆదేశాలు.. తాగి నడిపితే కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనం నడిపై డ్రైవర్లపై కేరళ హై కోర్టు స్పందించింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. అందులో భాగంగానే పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి.. వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపించారు. త్రిపుణితుర హిల్ ప్యాలెస్ పోలీసులు తనిఖీల్లో భాగంగా 16 మంది బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ కు తీసుకెళ్లి శిక్ష విధించారు. వారికి పెన్ను, పేపర్ చేతికిచ్చి వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు.
వెయ్యి సార్లు ఇంపోజిషన్ రాస్తే.. వదిలేసినట్లు కాదండోయ్. దీనితో పాటు.. నిబంధనలు అతిక్రమించినందుకు అసలు శిక్ష తప్పదని పోలీసులు అన్నారు. ఈ వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిలో నలుగురు స్కూల్ బస్సు డ్రైవర్లు ఉన్నారు. ఇద్దరు కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు.. మరో 10 మంది ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఉన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, నడిపిన వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు. ఇదిలాఉంటే, మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన డ్రైవర్లను స్టేషన్‌లో వరుసగా కూర్చోబెట్టి పేపర్లపై పోలీసులు ఇంపోజిషన్ రాయించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.