Site icon Prime9

Joshimath: కుంగిపోతున్న నగరం.. భయం భయంగా ప్రజలు.. జోషిమఠ్‌లో ఏం జరుగుతుందంటే..?

sinking town joshimath జోషిమఠ్ లో కూలిపోతున్న ఇళ్లు

sinking town joshimath

Joshimath: ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్‌లో  తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వందలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఇప్పటికే అనేక కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశాయి.

జోషిమఠ్ లోని 9 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ దాదాపు 5 వందల ఇళ్లు ఉన్నాయి.

కొన్నిచోట్ల భూమి నుంచి నీళ్లు ఉబికివస్తున్నాయి. తాజాగా సింగ్ థార్ వార్డులోని ఓ టెంపుల్ కుప్పకూలింది.

ఈ ఘటన సమయంలో గుడిలో ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

దీంతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 66 కుటుంబాలు సుురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి.

అప్రమత్తమైన యంత్రాంగం..

దీంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతోంది. కాగా, జోషిమఠ్‌ లో నెలకొన్ని పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నట్టు చెప్పారు. అధికారుల నుంచి నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి భరోసా ఇచ్చారు. శనివారం స్వయంగా జోషిమఠ్ వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు. ఒక బృందాన్ని కూడా జోషిమఠ్‌కు పంపుతున్నట్టు తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద రోప్ వే జోషిమఠ్ లోనే ఉంది. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో రోప్ వే ప్రయాణాలను నిలిపివేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.

రోజా నోటికన్నా చెత్తకుప్ప నయం | Nagababu Shocking Comments On Minister Roja | @Prime9Digital

కాగా, మార్వాడి వార్డులో గ్రౌండ్ నుంచి వాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు వచ్చినట్టు జోషిమఠ్ మున్సిపల్ అధికారులు తెలిపారు. కొండ చరియలు కారణంగా జోషిమఠంలో నిరాశ్రయులైన కుటుంబాలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌సీసీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)లను ఛమోలీ జిల్లా యంత్రాగం కోరింది.

బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి జోషిమఠ్‌ను గేట్‌వేగా పిలుస్తారు. ఎన్‌టీపీసీ చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులో జోషిమఠ్ భూమి కుంగిపోవడానికి, రోడ్లు బీటలు వారడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. తాజా పరిణామాలతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్నిరోజులుగా ఆందోళనలు కూడా సాగిస్తున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే జోషిమఠ్ కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్​ కోసం హెలాంగ్, మార్వాడి మధ్య ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న టన్నెల్‌తో పాటు బైపాస్​రోడ్డు నిర్మాణం ఆపేయాలని డిమాండ్​చేస్తున్నారు. తపోవన్​– విష్ణుగడ్​ హైడల్​ప్రాజెక్టు కూడా ఈ విపత్తుకు కారణమని చెబుతున్నారు. నిర్మాణ పనులు నిలిపివేసి, తక్షణం పునరావాసం కల్పించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Mekapati Chandrashekar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి భార్య కొడుకుని అంటూ.. బహిరంగ లేఖ.

Kuppa Thotti Roja : మంత్రి రోజాకి గట్టిగా ఇచ్చిన నాగబాబు… నీది నోరు కాదు చెత్తకుప్ప తొట్టి అంటూ

Air India: ఎయిర్ ఇండియా విమానంలో మూత్రవిసర్జన కేసు.. నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ

Supreme Court : ’గే‘ మ్యారేజెస్ పై సుప్రీం కీలక నిర్ణయం…

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar