Site icon Prime9

Uttar Pradesh: గన్‌లో బుల్లెట్ లోడ్ చేయడం రాని ఎస్సై.. ఐజీ తనిఖీలో బుక్కయిన పోలీసులు

SI

SI

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలో రైఫిల్‌ను సరిగ్గా లోడ్ చేయడం మరియు కాల్చడంలో విఫలమయ్యాడు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భరద్వాజ్ స్టేషన్‌ను తనిఖీ చేస్తున్నప్పుడు, రైఫిల్‌ను ఎలా లోడ్ చేయాలో ప్రదర్శించమని సబ్-ఇన్‌స్పెక్టర్‌ని అడిగారు. బుల్లెట్ ఎలా లోడు చేయాలో కూడా కనీసం తెలియక ఇబ్బంది పడ్డాడు. చివరికి రైఫిల్ గొట్టం ద్వారా బుల్లెట్ లోపలికి తోసేశాడు. ఇది చూసిన ఐజీ ఆగ్రహానికి గురయ్యారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను సమాజ్ వాది పార్టీ ట్విట్టర్ పోస్ట్ చేస్తూ యూపీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. యోగి జీ పోలీసులకు తుపాకీ ఎలా కాల్చాలో కూడా తెలియదు ! వారి అజ్జానం తారాస్థాయికి చేరింది. బిజెపి ప్రభుత్వంలో పేదలను, అమాయకులను వేధిస్తున్న క్రమశిక్షణ లేని పోలీసు ఎస్‌ఐకి తుపాకీ ఎలా ఉపయోగించాలో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు” అంటూ ట్వీట్ చేసింది.

సబ్ ఇన్‌స్పెక్టర్ తప్పిదంతో పాటు మరికొందరు పోలీసు అధికారులు తనిఖీల్లో కాల్పులు జరపలేకపోయారు. ఔట్ పోస్ట్ ఇన్ ఛార్జి కూడా పదేపదే ప్రయత్నించిన తర్వాత కూడా టియర్ గన్‌ని ఆపరేట్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. సంత్ కబీర్ నగర్ లోని పలు పోలీస్ స్టేషన్లలో ఐజీ తనిఖీల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. దీనిపై ఐజి భరద్వాజ్ స్పందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సాధన మరియు శిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎలాంటి అనూహ్యమైన మోహరింపులకు సిద్ధంగా ఉండేందుకు శిక్షణను కొనసాగించాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

Exit mobile version