Site icon Prime9

Kharagpur Shocking Incident : ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన… తెగిపడిన హైటెన్షన్ వైర్ !

shoking incident happened in kharagpur railway station and goes viral

shoking incident happened in kharagpur railway station and goes viral

Kharagpur Shocking Incident : పశ్చిమ బెంగాల్‌ లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ప్లాట్‌ఫామ్‌పై టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా షాక్ కి గురి చేస్తుంది. కాగా ఆ సమయంలో బాధితుడు మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో అతడితో మాట్లాడుతున్న వ్యక్తి త్రుటిలో తప్పించుకోగా … వైర్ పడిన మరుక్షణమే ఆయన ఒరిగిపోయి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు.

కాగా స్టేషన్‌ లోని సీసీ టీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డు కాగా… ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అలానే బాధిత టీటీఈని సుజన్ సింగ్ సర్దార్‌గా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే ఆయనను ఖరగ్‌పూర్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనలో ఆయన ప్రాణాలతో బయట పడడంతో వరి కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. సుజన్ తలతో పాటు ఆయన శరీరం లోని పలుచోట్ల తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఖరగ్‌పూర్ టీఆర్ఎం మహమ్మద్ సుజత్ మాట్లాడుతూ… వైరు తెగి పడడానికి కచ్చితమైన కారణం తెలియదని అన్నారు. గాయపడిన టీటీఈ ఆరోగ్యం అదృష్టవశాత్తు నిలకడగా ఉందని… ఆయనతో తాము మాట్లాడినట్టు తెలిపారు.

Exit mobile version