Arvind Kejriwal Bail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఆయన బెయిల్‌పై విడుదల కావాల్సింది. అయితే ఈడీ ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ అర్జంట్ పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. తమ తీర్పు ఇచ్చే వరకు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి తిహార్ జైలు నుంచి శుక్రవారం నాడు విడుదల కావాల్సి ఉంది. కేజ్రీవాల్ తరపున వాదించిన న్యాయవాది తన క్లయింట్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని ట్రయల్ కోర్టులో వాదించారు.
శుక్రవారం సాయంత్రమే..(Arvind Kejriwal Bail)
ఇదిలా ఉండగా కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ రోజు రాజధాని ఢిల్లీలో నీటి కొరత పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. ఢిల్లీ నీటి శాఖమంత్రి అతిషి, కేజ్రీవాల్ భార్య సునీత కూడా రాజ్‌ఘాట్‌కు వెళ్లి అక్కడ అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేయాలనుకున్నారు.అయితే కేజ్రీవాల్‌కు గురువారం నాడు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈడీ కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకించింది. తమకు అప్పీలుకు వెళ్లడానికి 48 గంటల సమయం ఇవ్వాలని కోరినా జడ్జి నిరాకరించారు. కేజ్రీవాల్ రూ.1 లక్ష పూచీకత్తు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. కాగా ఈ బెయిల్ బాండ్‌ను శుక్రవారం డ్యూటీ జడ్జికి ఇచ్చి కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఢిల్లీ హై కోర్టు శుక్రవారం ఉదయం కేజ్రీవాల్ బెయిల్‌పై ఆర్డర్‌ను రిజర్వు చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకు కేజ్రీవాల్‌ను విడుదల చేయరాదని ఆదేశించింది.
ఇక కేజ్రీవాల్ అరెస్టు విషయానికి వస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై విచారిస్తోంది. ఇక ఈడీ వాదన విషయానికి వస్తే లిక్కర్ పాలసీ ద్వారా కేజ్రీవాల్ సుమారు వంద కోట్ల రూపాయలు వసూలు చేసి .. ఆ డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినియోగించారని ఆరోపిస్తోంది. అయితే కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీపార్టీ దీన్ని ఖండిస్తోంది. కేంద్రప్రభుత్వం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని,, ప్రతిపక్ష నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రత్యారోపణలు గుప్పిస్తోంది.