Site icon Prime9

Jodo Yatra: జోడోయాత్రలో పాల్గొన్న టీచర్ పై సస్పెన్షన్ వేటు

school-teacher-suspended-for-attending-bharat-jodo-yatra-in-barwani madyapradesh

school-teacher-suspended-for-attending-bharat-jodo-yatra-in-barwani madyapradesh

Jodo Yatra: దేశవ్యాప్తంగా రాహుల్ జోడోయాత్రతో దూసుకుపోతున్నాడు. రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ యాత్ర రాజకీయాలకు అతీతంగా సాగుతోంది. రాహుల్ వెంట పలువురు నటీనటులు వ్యాపారవేతలు ఇలా అనేక మంది నడక సాగిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో రాహుల్ వెంట ఈ యాత్రలో పాల్గొన్నందుకు ఓ స్కూల్ టీచర్ను సస్పెండ్ చేశారు.

మధ్యప్రదేశ్ లోని ఆదివాసీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ప్రైమరీ స్కూల్ లో రాజేశ్ కన్నోజి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండడంతో రాజేశ్ సెలవు పెట్టి ఈ యాత్రలో పాల్గొన్నాడు. నవంబర్ 24న రాహుల్ గాంధీని కలిసి తను వేసిన పెయింటింగ్స్ ను బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి కాస్తా వైరల్ గా మారడంతో ఈ విషయంపై ఉన్నతాధికారుల స్పందించారు. దీంతో ప్రొఫెషనల్ కండక్ట్ రూల్స్ అతిక్రమించారంటూ రాజేశ్ కు నోటీసులు పంపించారు. ఆపై విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా సస్పెన్షన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత్ జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా జరుగుతోందని వెల్లడించింది. ఈ యాత్రలో పాల్గొన్నందుకు రాజేశ్ ను సస్పెండ్ చేయడంపై మండిపడింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

ఇదీ చదవండి: హైదరాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి అంటే..?

Exit mobile version