Site icon Prime9

Viral News: బస్టాండ్లో స్కూల్ బాలికకు తాళికట్టిన మరో విద్యార్థి.. నెట్టింట వైరల్ వీడియో

school girl marriage at bus stop

school girl marriage at bus stop

Viral News: కొన్ని సంఘటనలు చూస్తే యువతరం ఎటుపోతుందో అనిపిస్తుంది. ప్రేమలు పెళ్లిళ్లు అనేవి నేటి యువతరానికి ఆశామాషీ వ్యవహారాల్లా మారిపోతున్నాయి. పాఠశాల చదువు పూర్తి కాకుండానే లవ్వులు ఏంటో.. ఎక్కడపడితే అక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటో..? నేటి తరాన్ని చూస్తే నిజంగానే కలికాలం అనాల్సి వస్తుంది. ఎంత ఫాస్ట్ జనరేషన్ అనుకున్నా మరీ చిన్నవయస్సులోనే పెళ్లిల్లు ఏంటో? ఇంతలా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా, తమిళనాడులో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓ స్కూల్ విద్యార్థినికి మరో విద్యార్థి ఏకంగా బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు.

తమిళనాడులోని చిదంబరంలోని విద్యార్థిని ఓ బ​స్టాండ్‌లో కూర్చుని ఉండగా యువకుడు తన జేబులోని నుంచి తాళి తీసి ఆ విద్యార్థిని మెడలో కట్టేశాడు. దానితో అక్కడే ఉన్న వారి స్నేహితులు పూలు చల్లి వారికి అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాలను కొందరు తన మొబైల్‌లో బంధించి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఇంకేముంది దానితో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది.

ఆ వీడియో చూసిన కొందరు వారిరువు మైనర్లని ఈ వివాహంపై విచారణ జరుపాలని తమిళనాడు పోలీసులను అభ్యర్థించారు. దానితో రంగంలోకి దిగిన కడలూరు పోలీసులు యూనిఫాంలో ఉన్న విద్యార్థినికి తాళికట్టడంపై వారిద్దరిని విచారణకు తీసుకెళ్లారు. అబ్బాయి పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థి కాగా, బాలిక మాత్రం 12వ తరగతి చదువుతోందని చెబుతున్నారు. ఏదేమైనా ఈ బస్టాండ్‌లో పెళ్లిని చూసి ప్రజలు షాక్‌ అవుతున్నారు.

ఇదీ చదవండి: బూట్లతో కాదు చెప్పులే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కఠిన నిబంధనలు

Exit mobile version