Site icon Prime9

Satyendar Jain: సత్యేందర్ జైన్ కేసు.. అది ఫిజియోధెరపీ కాదు.. మసాజ్.. చేసింది రేపిస్ట్ ..

Satyendar Jain

Satyendar Jain: తీహార్ జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్ మంచం మీద పడుకుని ఉండగా పాదాలకు మసాజ్ చేస్తున్నట్లు వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇది ఫిజియో ధెరపీ కాదని మసాజ్ చేసిన వ్యక్తి రింకు అనే పేరుగల వ్యక్తని జైలు వర్గాలు తెలిపాయి. అతను . అత్యాచారం కేసులో నిందితుడు, పోక్సో సెక్షన్ 6 మరియు ఐపీసీ 376, 506 మరియు 509 కింద అభియోగాలు మోపారు.

మనీలాండరింగ్ ఆరోపణలపై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ (58) కొన్ని పత్రాలను చదువుతుండగా, తెల్లటి టీ షర్టు ధరించిన వ్యక్తి కాళ్లకు మసాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ జైళ్ల శాఖ ఆప్ ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. అందువలనే జైన్ కు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆరోపించింది. కర్ఫ్యూ ఉన్న సమయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు జైన్‌కు మసాజ్‌లు చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేక ఆహారం కూడా అందించారు అంటూ ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజు తెలిపారు.దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని కూడా సబ్మిట్ చేసారు. ఎక్కువ సమయం జైన్ ఆసుపత్రిలో లేదా జైలులో వివిధ సౌకర్యాలను అనుభవిస్తున్నాడని ఆరోపించారు.మరోవైపు ఆప్ ఈ ఆరోపణలను అసంబద్ధం మరియు నిరాధారమైనవని కొట్టిపారేసింది.

అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ కేసులో జైన్‌తో పాటు మరో ఇద్దరిని ఈడీ మే 30న అరెస్టు చేసింది.జైన్ తనకు సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Exit mobile version