Sania Mirza : సానియా మీర్జా ముందు ఈ పేరు వినగానే అందరికీ టెన్నిస్ స్టార్ గుర్తుకు వస్తుంది. అయితే ఈసారి మాత్రం ఈ పేరు గల ఓ యువతి చారియత్ర సృష్టించని చెప్పవచ్చు. యూపికి చెందిన ఈ ఓ యువతి భారత వైమానిక దళంలో ఫైటర్ పైలెట్ గా ఎంపికైంది. దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా.. యూపీ నుంచి తొలిసారి ఎంపికైన ఫైటర్ పైలట్‌గా చరిత్ర కెక్కనుంది. ఆమె తండ్రి ఓ సాధారణ టీవి మెకానిక్. పేదరికంలో పుట్టినా కూడా తను కలల్ని సాకారం చేసుకోవానికి తీవ్రంగా కృషి చేసింది. ఆ కృషికి ఫలితంగా వైమానిక దళ చరిత్రలో తొలిసారి ఫైటర్ పైలట్‌గా ఎంపికైన ముస్లిం యువతిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే…
యూపీలోని కుగ్రామంలో ఉండే సానియా మీర్జా ఈ ఘనత సాధించింది. ఆమె తండ్రి టీవీ మెకానిక్. తన కలను సాకారం చేసుకోవడానికి పేదరికాన్ని సైతం ఎదిరించి… పట్టుదలతో పోరాడింది. భారత్ తొలి మహిళా ఫైటర్ పైలట్ అవని చతుర్వేదిని ఆదర్శంగా తీసుకుంది. ఆమెలా ఎప్పటికైనా పైలెట్ కావాలని కలలు కనేది. ఇంటర్ పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇక తన లక్ష్యానికి మరింత దగ్గరవ్వడం కోసం మీర్జాపూర్ లోని సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీలో చేరి శిక్షణ తీసుకుని ఎన్డీఏ పరీక్షలకు హాజరయ్యింది.
ఇక ఇటీవల విడుదల అయిన ఫలితాల్లో 149వ ర్యాంక్‌ను సాధించిన సానియా… ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ కావాలన్న కలను సాకారం చేసుకుంటోంది. సానియా డిసెంబరు 27న పుణె ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ కోసం సానియా చేరనుంది. టీవీ మెకానిక్ గా పనిచేస్తున్న సానియా తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ… తన కూతురు ఘనతను చూసి మాటలు రావటం లేదని ఉద్వేగానికి లోనయ్యారు. మహిళా ఫైటర్ పైలట్‌గా ఎంపికైన రెండో మహిళ నా బిడ్డ సానియా కావటం మా అదృష్టం..అదికూడా ఈ దేశానికి నా బిడ్డ సేవలందింబోతోంది ఇది మరీ ఆనందించాల్సిన విషయం అంటూ ఉద్వేగంగా తెలిపారు. అదే విధంగా ముస్లిం సామాజిక వర్గం నుంచి తొలి అమ్మాయిగా మా అమ్మాయి కావటం చాలా ఆనందంగా ఉందని… ఫైటర్ పైలట్ కావాలనే కలను కష్టపడి నెరవేర్చుకుందని సానియా తల్లి తబస్సుమ్ మీర్జా చెప్పారు. ఎంతోమంది అమ్మాయిలకు నా కూతురు ఆదర్శంగా నిలిచింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమెను అభినందిస్తూ అందరూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.