Site icon Prime9

Baba Ramdev: సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రామ్‌దేవ్

Baba Ramdev

Baba Ramdev

Baba Ramdev: ప్రముఖ బాలీవుడ్ నటులు డ్రగ్స్ సేవిస్తున్నారని యోగా గురు బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు, అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు, షారూఖ్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైలులో ఉన్నాడు. నటీమణుల విషయానికొస్తే, వారి గురించి దేవుడికి మాత్రమే తెలుసని అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయి.. రాజకీయాల్లోనూ డ్రగ్స్ ఉంటాయి.. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేస్తారు. ప్రతి డ్రగ్ అడిక్షన్ నుంచి భారతదేశం విముక్తి కావాలని తీర్మానం చేయాలి.. ఇందుకోసం ఉద్యమం చేపడతామపి వ్యాఖ్యానించారు.

బాబా రామ్‌దేవ్ అలోపతి వైద్యులపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేదాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకోవచ్చని, కానీ ఇతర వైద్య విధానాలను విమర్శించటం సరికాదని మండి పడింది.

Exit mobile version