Site icon Prime9

Sachin Pilot : మోదీ-అశోక్ గెహ్లాట్‌లపై సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు

Sachin Pilot

Sachin Pilot

Sachin Pilot: కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వాటిరి కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ అందుకున్న ప్రశంసలతో పోల్చారు.మీడియాను ఉద్దేశించి పైలట్ మాట్లాడుతూ, “నిన్న ప్రధానమంత్రి సిఎంను ప్రశంసించడం ఆసక్తికరంగా ఉంది. దానిని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే పార్లమెంటులో గులాంనబీ ఆజాద్‌ను పిఎం కూడా అదే విధంగా ప్రశంసించారు. ఏమి జరిగిందో మనందరం చూశామని అన్నారు.

సెప్టెంబర్ 25న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP)ని బహిష్కరించి బహిరంగ తిరుగుబాటుకు దారితీసిన ముగ్గురు పార్టీ నేతలకు నోటీసులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సచిన్ పైలట్ పిలుపునిచ్చారు.గెహ్లాట్ పార్టీ పదవికి పోటీ చేస్తే, ఆయన స్థానంలో తన ప్రత్యర్థి సచిన్ పైలట్ సీఎం అవుతారని వచ్చిన వార్తలపై అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే.

రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం అశోక్ గెహ్లాట్ వేదికను పంచుకున్న తర్వాత పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, అశోక్ జీ, నేను ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేశాం. ప్రస్తుతం వేదికపై కూర్చున్న వారిలో సీనియర్-మోస్ట్ ముఖ్యమంత్రులలో ఆయన ఒకరని అన్నారు.

Exit mobile version