Truck with Tomatoes: కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు సుమారు 21 లక్షల రూపాయల విలువైన టమోటాలను తరలిస్తున్న ట్రక్కు అదృశ్యమైనట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. కోలార్‌కు చెందిన మెహత్ ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యంలోని ట్రక్ జూలై 27న బయలుదేరింది. కాని ఇప్పటివరకు చేరుకోలేదు.
డ్రైవర్, క్లీనర్‌లపై అనుమానం..(Truck with Tomatoes)
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కోలార్‌లోని మండీ యజమాని ట్రక్కు, టమోటాలు అదృశ్యం కావడంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనం మరియు దాని సరుకు అదృశ్యమైనప్పటి నుండి ట్రక్కు యజమాని డ్రైవర్‌ను సంప్రదించలేకపోయాడు.లారీ డ్రైవర్, క్లీనర్‌లు వాహనంతో పాటు టమోటాలు చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తదుపరి విచారణ జరుగుతోంది.
ఇదే సందర్భంలో, కర్ణాటకలోని హసన్ జిల్లాలో, జూలైలో, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు, ఒక పొలం నుండి రూ. 1.5 లక్షల విలువైన టమోటాలను దొంగిలించి పారిపోయారు.తన పొలానికి చేరుకుని చూడగా పంట కనిపించకుండా పోయిందని రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50–60 బస్తాలతో పొలంలోకి ప్రవేశించిన దొంగలు, వాటిల్లో 1.5 లక్షల విలువైన టమాటాలను నింపి వెంటనే పరారయ్యారు.