Site icon Prime9

Gajarla Ravi: గాజర్ల రవిని పట్టిస్తే రూ.10 లక్షలు.. ఎన్ఐఏ ఆఫర్

gajarla ravi

gajarla ravi

Gajarla Ravi: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ టార్గెట్ చేసింది. గాజర్ల రవి ఆచుకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. గాజర్ల రవి.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందినవాడు. ఉద్యమం వైపు ఆకర్షితుడై.. 1992లో నక్సల్స్ లో అడవిబాట పట్టాడు. 2004 లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పాల్గొన్నాడు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిపై.. కేంద్ర దర్యాప్తు సంస్థ భారీ నజరానా ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. గాజర్ల రవి ఉగ్రవాది అని పేర్కొంటూ .. ఏఓబీలో పోస్టర్లు వెలిశాయి. రవితో పాటు మరో నలుగురు వాంటెడ్ మావోయిస్టుల సమాచారం కోసం అధికారులు పోస్టర్లను అతికించారు. రెడ్ కారిడార్‌లో నెలకొన్న పరిస్థితులను ఇటీవలే పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన ఎన్‌ఐఏ బృందం మావోయిస్టుల జాబితాను తయారు చేసింది.

ఇందులో గాజర్ల రవి అలియాస్ గణేష్.. ఆంధ్రప్రదేశ్‌లోని దబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ రైనో. బాతుపుర గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ బాబు, ఒడిశాలోని కడగుమ గ్రామానికి చెందిన ఖిల్లోరంజు అలియాస్ చంటిలను పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు ఇస్తామంటూ ఎన్ఐఏ ప్రకటించింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని.. అధికారులు చెబుతున్నారు. 2024 ఎన్నికలకు ముందే భారత్ ను నక్సల్స్‌ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటన చేశారు.

ఈక్రమంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న గాజర్ల రవిని ఎన్ఐఏ టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఉగ్రవాది అంటూ వేసిన పోస్టర్లపై చర్చ జరుగుతోంది.

దశబ్దాల పాటు.. ఉద్యమంలో ఉన్న గాజర్ల రవి (Gajarla Ravi) ఉగ్రవాది అంటూ ఎన్ఐఏ పేర్కొంది.

ఆంధ్రా ఒరిస్సా ప్రాంతాల్లో గాజర్ల రవి ఉగ్రవాదిగా పేర్కొంటు వెలసిన పోస్టర్లు.

గాజర్ల రవిని పట్టిస్తే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన కేంద్ర దర్యాప్తు సంస్థ.

ఉగ్రవాది అంటూ ఎన్ఐఏ (NIA)  వేసిన పోస్టర్లపై మావోయిస్టు వర్గాల్లో చర్చ.

గాజర్ల రవి స్వగ్రామం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల.

1992 లో నక్సల్స్ ఉద్యమంలో చేరిన గాజర్ల రవి.

2004లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్న రవి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version