Oscar Nominations: వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారతీయల కల తీరింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ లో స్థానం సంపాదించింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.
ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఈ నామనినేషన్ దక్కించుకుంది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరిగింది.
నామినేషన్లు (Oscar Nominations) ప్రకటన కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
95వ ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ చోటు దక్కించుకోవడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నాుర.
సినిమా రంగంలో అత్యుత్తమ అవార్డుగా ఆస్కార్ ను పరిగణిస్తారు. ఇది సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డ్.
ప్రపంచంలో సినిమా తీసే ప్రతి ఒక్కరు ఈ అవార్డు కోసం కలలు కంటారు. కొన్ని సినిమాలు ఈ నామినేషన్స్ లో నిలిచిన చాలు అనుకుంటారు.
అయితే ఈ ఏడాది అస్కార్ నామినేషన్స్ భారతీయులకి ఆసక్తిగా మారింది. దానికి కారణం.. దర్శకధీరుడు తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.
ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమాను మెచ్చుకుంది.
అయితే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందా అని భారతీయులు ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడంది.
ఇప్పటికే ఆస్కార్ కు క్వాలిఫై లిస్ట్ లో పలు ఇండియన్ సినిమాలు నిలిచాయి.
ఆస్కార్ నామినేషన్స్ లో మాత్రం ఆర్ఆర్ఆర్, చెల్లో షో, ఆల్ దట్ బ్రీత్స్ సినిమాలకు చోటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులు మాత్రం.. ఆర్ఆర్ఆర్ RRR తప్పకుండా ఆస్కార్ బరిలో నిలుస్తుందని భావించారు. అదే నిజమైంది.
ఇప్పటికే ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు.. హాలీవుడ్ అవార్డులు గెలుచుకుంది.
ఆర్ఆర్ఆర్ అభిమానులు, ఇండియన్ ప్రేక్షకులు నామినేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది.
మరో వైపు తన అద్భుత నటనతో అలరించిన ఎన్టీఆర్ ఆస్కార్ కు నామినేట్ అవుతారని అందరూ అంచనా వేశారు.
ఎన్టీఆర్ ఆస్కార్ నామినేట్ కావాలంటూ ట్వీట్టర్ లో ట్రెండ్ చేశారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్.. ఆస్కార్ బరిలో నిలుస్తాడని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.
ఈ సినిమాలో ప్రధాన పాత్రలను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించారు.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందించారు.
ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/