Site icon Prime9

Jammu and Kashmir: కాశ్మీరు లోయలో పడిన బస్సు.. 11 మంది స్పాట్ డెడ్

road accident in jammu kashmir

road accident in jammu kashmir

Jammu: జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. దాదాపు 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూంచ్ జిల్లాలోని సావ్జియాన్ నల్లా వద్ద ప్రయాణిస్తున్న బస్తు ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో పడింది. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. క్షతగాత్రులను పూంచ్ జిల్లా మండి పట్టణంలోని ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారని అధికారిక వర్గాలు తెలిపాయి.

కాగా ప్రమాదానికి గల కారణాలు ఏంటా అని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాయి అక్కడి ఆర్మీ వర్గాలు. ఈ ఘటన నిజంగానే డ్రైవర్ తప్పిందం వల్ల జరిగిందా లేదా ఏమైనా ఉగ్రమూకల కుట్రా అని విచారణ చేపట్టాయి. కాగా మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: తెలుగు నటిపై లైంగిక దాడి.. ఫిట్నెస్ ట్రైనర్ అరెస్ట్

Exit mobile version