Site icon Prime9

Bihar: జంగిల్ రాజ్.. డీఎస్పీ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేసాడు.

rjds-former-mlcs-son-grabs-dsps-collar

Patna: రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ అన్వర్ అహ్మద్ కుమారుడు అస్ఫర్ పాట్నాలో శుక్రవారం రాత్రి డీఎస్పీ అశోక్ సింగ్ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేశాడు. సబ్జీబాగ్ మరియు పిర్బహోర్ ప్రాంతంలో కొంతమంది పోలీసు సిబ్బందిని స్థానిక గూండాలు కొట్టిన సంఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని డీఎస్పీ సింగ్ చెప్పారు. దాడికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం ఓ వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం, అహ్మద్ గుంపుతో వచ్చి పోలీసులను దుర్భాషలాడాడు. డీఎస్పీ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.

అయితే, పోలీసు స్టేషన్‌లో గొడవ సృష్టించడం మరియు పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ప్రభుత్వ అధికారులు తమ విధులను చేయకుండా అడ్డుకున్నందుకు అహ్మద్‌ పై పాట్నా పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాను అమలు చేస్తున్నది జంగిల్ రాజ్ కాదు. జనతా కా రాజ్ అని పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. నితీష్‌ కుమార్‌ ‘జనతా కా రాజ్‌’ వాదన పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లోపల పోలీసులే సురక్షితంగా లేనప్పుడు ఇది ఎలాంటి జనతా కా రాజ్? అని పేర్కొన్నాడు.

Exit mobile version