Delhi Temperatures: దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటి పోయాయి. అలాగే రాజస్థాన్ లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి.
రాజస్థాన్ నుండి వేడి గాలులు..(Delhi Temperatures)
ఎండ తీవ్రతతో వేడి గాలులు తోడు కావడంతో ప్రజలు భరించలేకపోతున్నారు. ఇంత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ నమోదు కాలేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది.మాడు పగిలేలా ఎండలు దంచికొడుతుండడంతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక కారణాన్ని వివరిస్తూ, భారత వాతావరణ విభాగం ( ఐఎండి ) ప్రాంతీయ అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాజస్థాన్ నుండి వేడి గాలులు వీచే ప్రాంతాలు నగర శివార్లలో ఉన్నాయని అన్నారు.ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ఈ వేడి గాలుల ముందస్తు రాకకు గురవుతాయి. ఇవి ఇప్పటికే తీవ్రమైన వాతావరణాన్ని మరింత దిగజార్చాయి. ముంగేష్‌పూర్, నరేలా మరియు నజఫ్‌గఢ్ వంటి ప్రాంతాలు ఈ వేడి గాలుల యొక్క ప్రభావానికి గురయ్యాయని ఆయనచెప్పారు. ఇలా ఉండగా 30 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఢిల్లీకి ఐఎండి య రెడ్ అలర్ట్ హెల్త్ నోటీసును జారీ చేసింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నందున అన్ని వయసులవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.