Site icon Prime9

Kerala: రేపిస్ట్.. శాడిస్ట్.. మానవ అక్రమరవాణాదారుడు.. కేరళ నరబలి కేసులో ప్రధాన ముద్దాయి షఫీ

shafi

shafi

Kerala: కొచ్చిలోని అతని పొరుగువారికి, షఫీ కిరాణా దుకాణం యజమాని, గతంలో ట్రక్ డ్రైవర్. వారు అతనితో మరియు అతని కుటుంబంతో పెద్దగా సంభాషించనప్పటికీ అతను రేపిస్ట్ మరియు మానవ అక్రమ రవాణాదారుడని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు. కేరళలోని పతనం తిట్ట జిల్లాలో జరిగిన నరబలి వెనుక ఉన్నది ప్రధాన ముద్దాయి షఫీనే. ఆర్దిక ఇబ్బందులతో ఉన్న దంపతులు బలహీనతలను అతను పసిగట్టి నరబలిదిశగా వారిని ప్రోత్సహించాడు.

షఫీపై దొంగతనం మరియు అత్యాచారం సహా అనేక కేసులు ఉన్నాయి. గత 15 ఏళ్లలో అతనిపై కనీసం 10 కేసులు నమోదయ్యాయి. ఒక సందర్భంలో, 75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, ఆమె శరీరంలోని వివిధ భాగాలలో కత్తితో గాయపరిచాడు. నరబలిలో ఇద్దరు బాధితులు ఇదే విధంగా ప్రైవేట్ భాగాలలో గాయపడ్డారు. ఈ కేసులోనిందితులైన భగవల్ సింగ్, లైలా దంపతులను ఎరగా వేసి ట్రాప్ చేసేందుకు షఫీ ‘శ్రీదేవి’ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను సృష్టించాడు. అతను ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సింగ్‌ను సంప్రదించాడు, అతని హైకూను ప్రశంసించాడు. ఆర్థిక సమస్యల కోసం సహాయం కోసం ఒక క్షుద్ర మాంత్రికుడిని సంప్రదించమని అతనిని ఒప్పించాడు. అలాంటి వ్యక్తిని సంప్రదించమని ఆ జంటనుఒప్పించిన తర్వాత, ‘శ్రీదేవి’పేరుతో షఫీ తనను వారిద్దరికీ పరిచయం చేసుకున్నాడు. అతను ఎలంతూర్‌లోని వారి ఇంటిని తరచుగా సందర్శించడం ప్రారంభించాడు. తనపేరు రషీద్ అని చెప్పుకున్నాడు. త్వరలోనే ముగ్గురూ బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. సింగ్ సమక్షంలో లైలాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని రషీద్ దంపతులకు చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి. సంపద మరియు డబ్బు వస్తాయని చెప్పడంతో కళ్ళుమూసుకుని, ఆ జంట లొంగిపోయారు. తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ‘నరబలి’ ఆచారాన్ని నిర్వహించాలని షఫీ దంపతులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మొదటి హత్య జూన్ 8 న జరిగింది , అయితే దానికి తగ్గ ప్రయోజనాలు రాకపోవడంతో ఆ తర్వాత సెప్టెంబర్ 26న రెండవ మహిళ హత్యకు దారి తీసింది. షఫీరెండు కేసుల్లోనూ ఏజెంట్ పాత్ర పోషించడమే కాకుండా పని పూర్తి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మృతదేహాలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టి ఉండడంతో అవి ఒక ఆకారంలో లేవని పోలీసులు తెలిపారు. మంగళవారం పతనంతిట్ట గ్రామంలోని దంపతుల ఇంటి ఆవరణలో నరికిన మృతుల శరీర భాగాలను బయటకు తీశారు. వండిన మానవ శరీర భాగాలను తినడం వల్ల యవ్వనాన్ని కాపాడుకోవచ్చని దంపతులకు ప్రధాన నిందితుడు షఫీ చెప్పినట్లు తెలిసింది.

షఫీ ప్రస్తుత నివాస స్థలం కొచ్చిలోని గాంధీ నగర్, అక్కడ అతను తన భార్య మరియు ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నాడు. అతనికి ఒక ఎస్ యువి సహా రెండు వాహనాలు ఉన్నాయి. అతని కుమార్తెలలో ఒకరికి వివాహమైంది. అతను కొచ్చిలో ఒక హోటల్ నడుపుతున్నాడు. పెద్దగా బ్యాగ్ గ్రౌండ్ లేని సమస్యల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. అయితే అతను ఇంటికి తన సంపాదన సరిగా ఇవ్వడని, మద్యం తాగే అలవాటు కారణంగానే అతడు ఇలా తయారయ్యాడని భార్య చెబుతోంది.

Exit mobile version