Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్టకు దరఖాస్తు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. ‘ఆర్డినరీ పాస్ట్ పోర్టు’ ను పొందేందుకు ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 26న విచారణ జరుపనున్నట్టు న్యాయస్థానం తెలిపింది.
కొత్తగా ఆర్డినరీ పాస్ పోర్టుకు(Rahul Gandhi)
‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యల వ్యవహారంలో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పనై అనర్హత వేటు వేస్తే లోకసభ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ తన డిప్లోమాటిక్ పాస్ పోర్టుతో సహా అన్ని రకాల ట్రావెల్ డాక్యుమెంట్లను సంబంధింత అధికారులు తిరిగి ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం కొత్తగా ఆర్డినరీ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
శుక్రవారం విచారణ(Rahul Gandhi)
అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాస్ పోర్టు జారీ విషయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని రాహుల్ ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు శుక్రవారం విచారణ చేస్తామని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు రాహుల్ కు 2015, డిసెంబర్ 19 న బెయిల్ మంజూరు చేసింది.
మరో వైపు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవ్వడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాసేపు టెన్షన్ పడ్డారు. ఆయన కోర్టుకు వచ్చిన విషయం ఖచ్చితంగా తెలియక పోవడంతో ఏం జరుగుతుందో అని కంగారు పడ్డారు. అనంతరం అసలు విషయం తెలుసుకుని హమ్మయ్య అనుకున్నారు.