Site icon Prime9

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదానీ గ్రూపుపై దర్యాప్తు చేపడతాం.. రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ ఓవర్ ఇన్‌వాయిస్ చేసి రూ. 32,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ ఆరోపించారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.  అదే సమయంలో దర్యాప్తుకు ఆదేశించడం ద్వారా తన విశ్వసనీయతను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

విద్యుత్ రేట్లపై ప్రభావం..(Rahul Gandhi)

అదానీ అంశంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని కోరుతున్నాను అని రాహు‌ల్ అన్నారు. దీనికి ఆధారంగా ‘ఫైనాన్సియల్ టైమ్స్’ ఇటీవల రాసిన ఓ వార్తా కథనాన్ని మీడియాకు చూపించారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు బిలియన్ డాలర్ల బొగ్గును అదానీ గ్రూప్ దిగుమతి చేసుకున్నట్టు కనిపిస్తోందంటూ ఆ కథనం పేర్కొంది. అద్వానీ ఓవర్ ఇన్వాయిస్‌డ్ బొగ్గు దిగుమతుల వల్ల 32వేల కోట్ల మేర ప్రజల జేబులు చిల్లుపడ్డాయన్నారు. ఇండోనేసియా నుంచి అదానీ బొగ్గు కొనుగోలు చేశారని, అది ఇండియాకు చేరే సరికి ధర రెట్టింపయిందని నివేదికను ఉటంకిస్తూ రాహుల్ వివరించారు. బొగ్గు ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల దేశంలోని విద్యుత్ రేట్లపై ఆ ప్రభావం పడిందని, దీంతో వినియోగదారులు హెచ్చు విద్యుత్ ధరలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఇది ప్రత్యక్ష దోపిడీ అని, ప్రపంచంలో ఏ ప్రభుత్వమైన దీనిపై చర్యలు తీసుకుంటుందని, కానీ ఇండియాలో మాత్రం ఎలాంటి చర్యలు లేవని ఆయన ప్రధాని మోదీపై మండిపడ్డారు.

అదానీకి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఆయన వెనుక ఏ శక్తి ఉందో అందరికీ తెలుసు” అని రాహుల్ విమర్శలు గుప్పించారు. స్టాక్ ప్రైజ్‌ మానిప్యులేషన్‌కు పాల్పడుతున్నారంటూ అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసినప్పుడు కూడా తాను ప్రశ్నించానని గుర్తు చేశారు. కాగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అప్పట్లో అదానీ గ్రూప్ ఖండించింది. ఎలాంటి తప్పిదాలకు తాము పాల్పడలేదని ప్రకటించింది. అయితే, రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలపై మాత్రం ఇంకా అదానీ గ్రూప్ స్పందించలేదు.
=

Exit mobile version