Rahul Gandhi: ఢిల్లీ ఫర్నిచర్ మార్కెట్లో కార్పెంటర్లతో రాహుల్ గాంధీ ముచ్చట్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్‌లోని ఫర్నిచర్ మార్కెట్‌ను సందర్శించి కార్పెంటర్లు, కార్మికులతో ముచ్చటించారు. దీనికి సంబంఢించి కాంగ్రెస్ పంచుకున్న వీడియోలు మరియు చిత్రాలు రాహుల్ గాంధీ హస్తకళాకారులతో కలిసి పనిచేస్తున్నట్లు చూపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - September 28, 2023 / 07:48 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్‌లోని ఫర్నిచర్ మార్కెట్‌ను సందర్శించి కార్పెంటర్లు, కార్మికులతో ముచ్చటించారు. దీనికి సంబంఢించి కాంగ్రెస్ పంచుకున్న వీడియోలు మరియు చిత్రాలు రాహుల్ గాంధీ హస్తకళాకారులతో కలిసి పనిచేస్తున్నట్లు చూపిస్తున్నాయి.

నేర్చుకోవడానికి ప్రయత్నించాను..(Rahul Gandhi)

అనంతరం రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ఇలా పోస్ట్ చేసారు. నేను ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్‌కి వెళ్లి ఈరోజు కార్పెంటర్ సోదరులను కలిశాను. వారు కష్టపడి పనిచేసేవారు మరియు అద్భుతమైన కళాకారులు . దృఢత్వం మరియు అందాన్ని రూపొందించడంలో ప్రవీణులు! దీనికి సంబంధించి ఓ ఫోటో కూడా పోస్ట్ చేసి చాలా సంభాషణలు జరిగాయని చెప్పారు. నేను వారి నైపుణ్యాల గురించి కొంచెం తెలుసుకోవడానికి మరియు కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నించాను అని అన్నారు.

అంతకుముందు  ఈ నెల 21న ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో రాహుల్ గాంధీ రైల్వే పోర్టర్లను కలిసి వారి సమ్యలను అడిగి తెలుసుకున్నారు. పోర్టర్ మాదిరి తాను కూడా ఎరుపు చొక్కా ధరించి తన తలపై లగేజీని మోసారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి సమాజంలోని వివిధ వర్గాలతో సంభాషిస్తున్నారు. ఇటీవల లడఖ్‌లో కూడా పర్యటించి వివిధ సామాజిక వర్గాలతో సంభాషించారు.