Priyanka Gandhi: భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో బుధవారం ప్రవేశించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అందులో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు.ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ గా ఉన్న ప్రియాంక గాంధీ యాత్రలో చేరడం ఇదే తొలిసారి.ప్రియాంక గాంధీ అక్కడ యాత్రలో నాలుగు రోజుల పాటు పాల్గొంటారు ,అని జైరామ్ రమేష్ హిందీలో తన ట్వీట్‌లో తెలిపారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్ర బుర్హాన్‌పూర్ నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అయితే.. ఈ యాత్ర షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేశారు. ముందుగా రాహుల్ గాంధీ నవంబర్ 27న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మస్థలమైన మోవ్‌కు వెళ్తున్నారని భావించారు. కానీ, ఇప్పుడు అది 26 నే మోహౌకు చేరుకుంటుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండిభారత్ జోడో యాత్రను ప్రారంభించారు.ఇది ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర లో కొనసాగింది.