Site icon Prime9

Priyanaka Gandhi: ప్రధాని మోదీ బలవంతంగా అదానీ పేరు ప్రస్తావిస్తున్నారు.. ప్రియాంకగాంధీ

Priyanaka Gandhi

Priyanaka Gandhi

Priyanaka Gandhi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నాడు తెలంగాణ పర్యటనలో రాహుల్‌గాంధీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రోజు అదానీ.. అంబానీ.. అంబానీ..అదానీ అంటూ విమర్శించే రాహుల్‌ ప్రస్తుతం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు కూడా వీరి నుంచి టెంపోల్లో నోట్ల కట్టలు ముట్టినందుకు మౌనం పాటిస్తున్నారా అని నిలదీశారు. అయితే తాజాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. తన సోదరుడు రాహుల్‌ తన ప్రసంగంలో రోజు అదానీ… అంబానీల పేర్లను ప్రస్తావిస్తున్నారని అన్నారు. వాస్తవం ఏమిటంటే రాహుల్‌ ప్రతి రోజు అదానీ పేరు ప్రస్తావిస్తుంటారు. దీంతో ప్రధాని బలవంతంగా అదానీ పేరు ప్రస్తావించాల్సి వస్తోందని ప్రియాంకా గురువారం నాడు రాయబరేలిలో మాట్లాడుతూ అన్నారు.

ప్రధాని అబద్దాలు చెబుతున్నారు..(Priyanaka Gandhi)

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగంలో బీజేపీకి 400 సీట్లు అప్పగిస్తే.. అయోధ్యలో రామమందిరానికి కాంగ్రెస్‌ పార్టీ బాబ్రీ తాళం వేయలేదన్న ప్రకటనపై ప్రియాంకా స్పందించారు. ఇది పచ్చి అబద్దమని ప్రియాంకా అన్నారు. కాంగ్రెస్‌పార్టీ తరచూ చెప్పేది ఒక్కటే… సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని.. తాము అదే పాటిస్తున్నామని ప్రియాంకా అన్నారు. బీజేపీతో పాటు ఎంఐఎం చీఫ్‌అసదుద్దీన్‌ ఒవైసీపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓవైసీ నేరుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఆయన ఎక్కడ అవసరమో అక్కడ ఆయన పార్టీకి చెందిన అభ్యర్థిని తెచ్చి నిలబెడుతున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతోందని, ఇది తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు ప్రియాంకా.

బుధవారం నాడు ప్రధానమంత్రి తెలంగాణలోని కరీంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ .. రాహుల్‌ను ఉద్దేశించి రాకుమారుడు ఐదుగురు పారిశ్రామికవేత్తలు అని మొదలుపెట్టి తర్వాత అంబానీ… అదానీల గురించి మాట్లాడుతారు. ప్రస్తుతం ఆయన ఎందుకు మూగనోము పట్టారు అని నిలదీశారు. గత ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌ రాకుమారుడు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్‌ రికార్డులా వీరిపేర్లు ప్రస్తావిస్తున్నారు. రాఫెల్‌ అంశం మరుగున పడిన తర్వాత ఐదుగురు పారిశ్రామికవేత్తలు అంటూ అంబానీ.. అదానీల పేర్లను ప్రస్తావిస్తుంటారు.

అయితే ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత ఆయన వారిపై దాడులుచేయడం మానేశారు. తెలంగాణ గడ్డ నుంచి తాను యువరాజను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. కాంగ్రెస్‌ పార్టీ అంబానీ .. అదానీల నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు అని నిలదీశారు. రాత్రికి రాత్రి వారి పేర్లను ఉచ్చరించడం మానేశారు. తప్పనిసరిగా దాల్‌ మీ కుచ్‌ కాలా హై అన్నారు ప్రధాని. గత ఐదు సంవత్సరాల నుంచి వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మరి ప్రస్తుతం మౌనం ఎందుకు వహించారు రాకుమారా అని మోదీ రాహుల్‌ను నిలదీశారు. దీనిపై తనకే కాదు ప్రజలకు కూడా అనుమానాలున్నాయి. రాకుమారుడు ఎంతో కొంత మొత్తం వారి నుంచి వసూలు చేసి ఉంటాడని ప్రజలు కూడా అనుమానిస్తున్నారని ప్రధాని అన్నారు.

Exit mobile version