New Delhi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ ల భేటీ ఖరారైంది. నవంబర్ లో ఇండోనేషియాలోని బాలి వేదికగా జరగనున్న జీ-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఇరువురూ ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపిన్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వార తెలియచేసింది.
గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థిక శక్తులుగా వికసించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి అధినేతలు సమ్మతించడాన్ని స్వాగతిస్తున్నారు. టీ20 సదస్సులో వీరివురూ పరస్పర చర్చలు జరుపుతారు అని పేర్కొనింది.Ministry of External affairs: భారత్ లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ రెండు రోజుల సమావేశం.. హాజరుకానున్న బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి
భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత్-యుకె ల మధ్య సంత్సంబంధాలపై చర్చ జోరుగా సాగుతుంది. రుషి సునాక్ కు ప్రధాని మోదీ ప్రత్యేకించి శుభాకాంక్షలు కూడా తెలిపి వున్నారు. ఈ సందర్భంగా దీపావళికి పూర్తి అవ్వాల్సిన రెండు దేశాల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశాన్ని ప్రధాని మోదీ, కొత్త బ్రిటన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం పై కూడా త్వరలో ఒప్పందం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు రుషి సునాక్ పై బ్రిటన్ దేశ ప్రజలు మంచి ఆశలు పెట్టుకొని ఉన్నారు. గాడితప్పిన ఆర్ధిక మాంధ్యాన్ని అరికట్టేందులో రుషి సునాక్ బిజీ బిజీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Rishi Sunak: బ్రిటన్ ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాం.. నూతన ప్రధాని రుషి సునాక్