Site icon Prime9

PM Modi: మొహసానాకు మోదీ వరాల జల్లు.. గుజరాత్ లో మోదీ పర్యటన

Modi diwali gift to youngsters 75000 offer letters

Modi diwali gift to youngsters 75000 offer letters

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. దీని తర్వాత అక్టోబర్ 11న మధ్యప్రదేశ్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానాలోని మోధేరా నుంచి నేడు ప్రధాని తన పర్యటనను ప్రారంభించనున్నారు.  మోధేరా, మెహసానాలో రూ. 3900 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. దేశంలో మొదటి రౌండ్ ది క్లాక్ సౌరశక్తితో పనిచేసే గ్రామంగా మోధేరా గ్రామాన్ని ప్రధాన మంత్రి ప్రకటించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడ వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలను ప్రధాని మోదీ చేయనున్నారు. నేడు సాయంత్రం 6:45 గంటలకు మోదేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి 7:30 గంటలకు సూర్య దేవాలయాన్ని సందర్శించనున్నారు.

మరియు అక్టోబర్ 10, 11న కూడా మోదీ పర్యటన బిజీబిజీగా సాగనుంది. వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. అహ్మదాబాద్‌లో ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్‌ను, అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్ అసర్వాలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అక్టోబరు 11 తేదీ సాయంత్రం ఆయన మధ్యప్రదేశ్‌కు బయలుదేరి వెళతారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లి సాయంత్రం 5 గంటలకు మహాకాళేశ్వరుడిని దర్శించుకుని.. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి 7.15 గంటలకు ఉజ్జయినిలో జరిగే బహిరంగ సభ పాల్గొంటారు. అనంతరం ప్రధాన మంత్రి ఒక బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తారు.

ఇదీ చదవండి: గొంతు కోసి బ్యాగ్ లో కుక్కి ప్రేమోన్మాది కిరాతకం.. కానీ ఆఖరుకి..!

Exit mobile version