PM Modi comments: ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు. ఇలా తాయిలాలు ప్రకటించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే హక్కు పార్టీలకు లేదన్నారు ప్రధాని మోదీ.
తమ నగరంలో మెట్రో నిర్మిస్తామని హామీ ఇచ్చి మెట్రో పేరుతో ఎన్నికల్లో గెలుస్తారు. అటు తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చి అమలు చేస్తారు. దీని అర్ధం ఏమిటంటే మెట్రోలో ప్రయాణించే 50 శాతం ప్రయాణికులు తగ్గిపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. దీంతో హైదరాబాద్‌లో మెట్రో రైల్ నడిపిస్తున్న ఎల్ అండ్ టి హైదరాబాద్‌లో మెట్రో నడపాలా వద్దా అని సందిగ్ధంలో పడిందని రని మోదీ అన్నారు. ఇదిలా ఉండగా ఎల్ అండ్ టి ప్రెసిడెంట్, హోల్ టైం డైరెక్టర్, అండ్ సీఎఫ్‌ఓ ఆర్ శంకర్ రామన్ ఇటీవల ఒక బిజినెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రైడర్‌షిప్ తగ్గడంతో 2026 తర్వత విక్రయించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆఫర్ చేసిన తర్వాత నుంచి మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గిందని ఆయన వివరించారు.
ఖజానా ఖాళీ.. కాలుష్యం..(PM Modi comments)
ఇక హైదరాబాద్ ఎల్‌అండ్‌టి ప్రాజెక్టులో 90 శాతం వాటా ఎల్‌అండ్‌టి చేతిలోఉంటే … పది శాతం తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది. కాగా కంపెనీ 65 సంవత్సరాల పాటు మెట్రోను రాయితీలతో నడపాల్సి వస్తోంది. కాబట్టి ఇది ఎట్టిపరిస్థితుల్లోను గిట్టుబాటు కాదు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలా ఉచిత ప్రయాణిలకు తెరతీస్తే ప్రభుత్వ ఖజానాపై తీవ్రప్రభావం చూపుతుందన్నారు. ఒక వైపు అత్యధునిక రవాణా వ్యవస్థ కావాలంటారు… కాలుష్య రహిత ప్రయాణాలు కావాలంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులు కావాల్సిఉంటుంది. కాలుష్యం వెదజల్లే బస్సులపై ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందన్నారు ఎల్ అండ్ టీ కి చెందిన రామన్. ప్రధాని మంత్రి దీనిపై స్పందిస్తూ.. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల రెండు సమస్యలు తలెత్తుతాయి. ఒకటి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయితే.. మరోవైపు పర్యావరణం కాలుష్యం కూడాఅవుతుందన్నారు.
మెట్రో బతికి బట్టకలిగేది ఎలా ?..
ఒక వైపు బస్సులు కిటకిట లాడుతూ కాలుష్యం వెదజల్లుతుంటే.. మరో పక్క మెట్రో రైలు మాత్రం ఖాళీగా నడుస్తుంటాయి. ఇలా ఉంటే మెట్రో బతికి బట్టకలిగేది ఎలా అని ప్రశ్నించారు మోదీ. ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే దేశం ఎలా అభివృద్ది చెందుతుందని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఎల్ అండ్‌టి హైదరాబాద్ మెట్రో నుంచి నిష్ర్కమించాలనుకుంటే.. వెళ్లి పోవచ్చునని తెలంగాణ ముఖ్యమంత్ని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. మహిళలకు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. ఒక వేళ ఎల్ అండ్‌టి స్థానంలో వేరే ఏ కంపెనీ అయినా ఆసక్తి చూపితే వారికి అప్పగిస్తామన్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.