Prime Minister Modi in Kerala: కేరళలో రూ.4వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్‌‌ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 08:20 PM IST

 Prime Minister Modi in Kerala: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ‘న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్‌‌ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.

‘షిప్ బిల్డింగ్ హబ్’గా కొచ్చి..( Prime Minister Modi in Kerala)

ఈ సందర్భంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. తనకు కేరళలో లభించిన సాదర స్వాగతానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. త్రిసూర్‌లోని గురువాయూరు ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు ప్రధాని. కొచ్చి వంటి కోస్టల్ సిటీల సామర్థాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశానికి ‘షిప్ బిల్డింగ్ హబ్’గా కొచ్చి రూపుదిద్దుకోనుందన్నారు. పోర్టుల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతులను మరింత పటిష్టం చేయడం, పోర్టుల అనుసంధానాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా ఇండియా హబ్‌గా మారుతున్న తరుణంలో మన సముద్ర శక్తిని కూడా పెంచుకుంటున్నామని, ఇందుకు ఉదాహరణగా కొచ్చి అభివృద్ధిని త్వరలోనే చూస్తామని అన్నారు. నూతన మౌలిక వసతుల కల్పన ద్వారా కొచ్చి నౌకాశ్రయం సామర్ధ్యం మరింత పెరగనుందని చెప్పారు. నౌకా నిర్మాణం, మరమ్మతులు, ఎల్‌పీజీ టెర్మినల్‌తో దేశంలోని అతిపెద్ద డ్రై డాక్‌గా కొచ్చి నిలుస్తుందన్నారు ప్రధాని మోదీ.

ప్రధాని తన రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం త్రిసూరులోని గురువాయూర్ శ్రీకృష్ణస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవస్థానం అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నటుడు, బీజేపీ ఎంపీ సురేష్ గోపి కుమార్తె వివాహ కార్యక్రమంలోనూ మోదీ పాల్గొన్నారు. కాగా, ప్రధాని మోదీ కేరళలో పర్యటించడం గత రెండు వారాల్లో ఇది రెండవది కావడం విశేషం.