Site icon Prime9

PM Modi in Karnataka: కర్ణాటకలోని శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Karnataka

Karnataka

PM Modi in Karnataka:ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది. మాజీ కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప 80వ జన్మదినోత్సవం కావడం విశేషం. ఈ కార్యక్రమానికి ఆయన కూడా హాజరయ్యారు.

యడియూరప్ప పై ప్రధాని మోదీ ప్రశంసలు..(PM Modi in Karnataka)

ఈ రోజు ప్రత్యేకమైన రోజు. కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు బీఎస్‌ యడియూరప్ప పుట్టిన రోజు అని ప్రధాని అన్నారు. ఆయనకు భగవంతుడు దీర్ఘ ఆయుష్షు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు ప్రధాని మోదీ.మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తన జీవితాన్న పేద ప్రజలకు, రైతులకు అంకింతం చేశారన్నారు. గత వారం ఆయన కర్ణాటక అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రతి నాయకుడికి ప్రేరణ కావాలన్నారు మోదీ. ఎంత ఎదిగినా ఆయన ఒదిగే ఉంటారని మాజీ సీఎంపై ప్రశంసలు గుప్పించారు.

ఇదిలా ఉండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో ప్రధాన మంత్రి పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా… శివమొగ్గ-శిఖారిపూరా, రెనీ బెన్నరూలో కొత్త రైల్వే లైను, కోటేగంగనూరులో రైల్వే కోచింగ్‌ డిపో వీటిలో ఉన్నాయి. కొత్త రైల్వే లైను మల్నాడు రిజియన్‌తో పాటు బెంగళూరు – ముంబై లైనును కలుపుతుంది. దీనికి 990 కోట్ల పెట్టుబడులు పెట్టి అభివృద్ది చేస్తున్నారు. దీంతో పాటు 215 కోట్ల విలువ చేసే పలు రోడ్డు ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు ప్రధాని.

రూ.450 కోట్లతో విమానాశ్రయం అభివృద్ది..

శివమొగ్గ కొత్త విమానాశ్రయాన్ని సుమారుగా రూ.450 కోట్లతో అభివృద్ధి చేశారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణీకులను నిర్వహించగలదు. ఈ విమానాశ్రయం కర్ణాటకలోని మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ మరియు ఇతర పొరుగు ప్రాంతాల నుండి కనెక్టివిటీ మరియు యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు, మే నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మోదీ ఈ ఏడాది ఐదవసారి పర్యటించడం విశేషం.విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ శివమొగ్గ విమానాశ్రయం అందంగా ఉంది. ఈ విమానాశ్రయంలో, కర్ణాటక సంప్రదాయం మరియుసాంకేతికత కలయికను చూడవచ్చు. ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు. ఈ ప్రాంత యువత కలల కొత్త ప్రయాణానికి ఇది నాంది అని అన్నారు.

ఇంతకుముందు కర్ణాటక అభివృద్ధి గురించి చర్చించినప్పుడు, అది పెద్ద నగరాలకే పరిమితమై ఉండేది. కానీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దీనిని కర్ణాటక గ్రామాలకు మరియు టైర్ 2 మరియు  3 నగరాలకు విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఆలోచన ఫలితమే శివమొగ్గ అభివృద్ధి.’ ‘వాహనమైనా, ప్రభుత్వమైనా డబుల్ ఇంజన్‌ అమర్చినప్పుడు దాని వేగం పెరుగుతుందని మనందరికీ తెలుసు. కర్ణాటక అటువంటి డబుల్ ఇంజిన్‌తో ముందుకు సాగుతోంది, అది వేగంగా నడుస్తోంది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరో పెద్ద మార్పు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.

Exit mobile version