Site icon Prime9

PM MODI: ఫలితాలపై కాంగ్రెస్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

PM MODI

PM MODI

PM MODI: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈరోజు ఉదయం నుంచి ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కిపుకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాలకు పరిమితమయ్యారు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

 

అభివృద్ధికి సహకరిస్తాం(PM MODI)

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుదని ఆశిస్తున్నాను. కర్ణాటక అభివృద్ధికి మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అని మోదీ తెలిపారు. అదే విధంగా కర్ణాటకలో బీజేపీ కి మద్దతుగా నిలిచివారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషిని అభినందించారు. రాబోయే కాలంలో మరింత శక్తితో సేవ చేస్తామని మోదీ ట్వీట్ లో చేశారు.

 

 

 

రాత్రికి బొమ్మై రాజీనామా(PM MODI)

కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవి చూసింది. బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వారం రోజుల పాటు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కిలీ మీటర్ల కొద్ది ర్యాలీ నిర్వహించారు. అయితే ఇవేమీ పెద్దగా ప్రభాదం చూపలేకపోయాయి. మరో వైపు బీజేపీ ఓటమితో ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మ శనివారం రాత్రికి రాజీనామా చేసే అవకాశం ఉంది. కాగా, రేపు కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

 

Exit mobile version