PM Modi : సినిమాల వంటి అసంబద్ధ అంశాలపై అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
లోక్ సభ ఎన్నికలకు సుమారు 400 రోజులే మిగిలి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు.
బీజేపీకి ఓటు వేస్తారా, వేయరా అనే విషయాన్ని పక్కనపెట్టి ముస్లింలు సహా మైనారిటీలందరికీ చేరువ కావాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం అందుతుంది.
పాస్మాండా ముస్లింలు, బొహ్రాలు, ముస్లింలలో వృత్తి నిపుణులు, విద్యావంతులను కలుసుకోండి అని మోదీ చెప్పారని పార్టీ నాయకులు తెలిపారు.
యూనివర్సిటీలు, చర్చిలను సందర్శించా లని కూడా నిర్దేశించారు. కొందరు ఏదో సినిమాపై వ్యాఖ్యలు చేస్తారు.
దాన్నే రోజంతా టీవీలు ఊదరగొడతాయని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలు బీజేపీ అభివృద్ధి అజెండాను వెనక్కి నెట్టేస్తాయని చెప్పారు.
కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పాస్మాండా ముస్లింలను కలుసుకుని, ప్రభుత్వ కార్యక్రమా లపై అవగాహన కల్పించాలని మోదీ సూచించారని భాజపా నేత ఫడణవీస్ తెలిపారు.
కాగా ఈ సమావేశంలో అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు ప్రధానమంత్రి మోడీ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజులుగా దేశమంతటా పఠాన్ చిత్రంపై వివాదం కొనసాగుతోంది.
దేశాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రింబవళ్లు మనమంతా కష్టపడుతున్నామని, కానీ మనలో కొందరు మనకు సంబంధంలేని అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అదే వ్యాఖ్యలు టీవీల్లో పదే పదే ప్రసారమవుతున్నాయని, దీనివల్ల పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు పోతోందన్నారు.
అందుకే అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని గట్టిగా చెప్పారు.
ఢిల్లీలో రెండురోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా అందరూ పనిచేయాలంటూ ఈ సందర్భంగా మోడీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ప్రధానమంత్రి మోదీ ఏ సినిమా పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే నటించిన పఠాన్ చిత్రంపై వివాదం జరుగుతున్న తరుణంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
పీఎం మోదీ (PM Modi) కామెంట్స్ అ సినిమా గురించేనా..
ఇప్పటికే పఠాన్ చిత్రంపై బీజేపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా లోని ‘బేషరమ్ రంగ్’ పాటలో అశ్లీలత ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా అసభ్యత ఎక్కువగా ఉన్న సీన్లను తొలగించకపోతే మధ్యప్రదేశ్ లో సినిమా విడుదలపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొనే ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/