Rahul Gandhi Comments: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో సెక్స్ స్కాండల్‌లో కూరుకుపోయిన జెడి ఎస్‌యుతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని మాస్ రెపిస్టు కోసం ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ప్రజ్వల్ రెవన్న పాల్పడింది సెక్స్‌స్కాండల్ కాదు.. మాస్ రెపిస్ట్ అని గురువారం నాడు ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు. వందలాది మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ప్రజ్వల్‌కు ఓటు వేయాలని ప్రధానమంత్రి మోదీ ఓట్లు అడుగుతున్నాడని రాహుల్ కర్నాటకలోని శివమొగ్గలో ఎన్నికల సభలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఈ రేపిస్టుకు ఓటు వేస్తే తనకు లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారని రాహుల్ పేర్కొన్నారు. కాగా కర్నాటకలో మే7న రెండవ విడత పోలింగ్ జరుగనుంది.
రేవన్న పారిపోవడానికి ప్రధాని సాయం చేసారు..(Rahul Gandhi Comments)
మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ్ మనవడు అయిన ప్రజ్వల్ రెవన్న దేశం నుంచి పారిపోవడానికి ప్రధానమంత్రి సాయం చేశారని రాహుల్ అన్నారు. ప్రజ్వల్ రెవన్న వందలాది మంది మహిళలపై అత్యాచారాలు చేశాడు. అయినా ప్రధానమంత్రి అతన్ని జర్మనీకి పారిపోకుండా అడ్డుకోలేకపోయారన్నారు. ప్రధానమంత్రి చేతిలో మొత్తం వ్యవస్థ ఉంది. అయినా. ఆయన మాత్రం రెపిస్టును జర్మనీకి పారిపోయేందకు సహకరించారు. ఇది మోదీ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. అవినీతిపరుడైన నాయకుడైన, మాస్ రేపిస్టు అయినా..బీజేపీ మాత్రం వారిని రక్షిస్తుందన్నారు. ప్రజ్వల్ పోటీ చేస్తున్న హసన్ నియోజకవర్గంలో వేలాది పెన్ డ్రైవ్‌లు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. కాగా బీజేపీ, జెడియు కర్ణాటకలో పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా హసన్ సీటు ప్రజ్వల్‌కు కేటాయించడం జరిగింది.
ప్రస్తుతం కర్ణాటకలో హల్ చల్ చేస్తున్న టేపులు రికార్డు చేసింది మాత్రం ప్రజ్వల్ .. తన ఇంటితో పాటు ఆఫీస్‌లో ఈ టేపు రికార్డు చేసుకున్నాడు. ప్రారంభంలో గౌడ కుటుంబంతో పాటు బీజేపీ కూడా ఈ టేపులన్నీ మార్ఫింగ్ అని బుకాయించింది. తమ కుటుంబంపై బురద జల్లడానికి వినియోగిస్తున్నారని మండిపడ్డారు. తర్వాత హెచ్‌డీ కుమారస్వామి మాత్రం ఈ కేసుకు సంబంధించి అంటిముట్టనట్లు ఉంటున్నారు. పోలీసు విచారణలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పి ఊరుకున్నారు.