Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ టూర్ అస్సోంలోని దిబ్రూగఢ్ వరకు సాగుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ సరికొత్త పర్యాటకానికి నాంది పలుకుతోందన్నారు. అంతేకాకుండా ఈ రివర్ టూరిజం కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశంలోని ఇంకొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పర్యాటక క్రూయిజ్ లు రానున్నాయని వెల్లడించారు.
మొదటగా 32 మంది స్విట్జర్లాండ్ పర్యాటకులతో గంగా విలాస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మోదీ ఆ పర్యాటకులకు ఆహ్వానం పలికారు. మీ ఊహకు అందని అద్భుతం భారత్ అని మోదీ అన్నారు. ఈ గంగా విలాస్ మొత్తం 27 నదుల గుండా ప్రయాణిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీప్రయాణం గంగా విలాస్ యాత్రది. ఈ టూర్ 51 రోజుల పాటు 3,200 కిలో మీటర్లు కొనసాగుతుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ క్రూయిజ్ ప్రయాణిస్తుంది.
MV గంగా విలాస్ నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 1.4 మీటర్ల డ్రాఫ్ట్‌తో సౌకర్యవంతంగా ప్రయాణిస్తుంది. ఇందులో మూడు డెక్‌లు, 36 మంది పర్యాటకులు ప్రయాణించే సామర్థ్యంతో 18 సూట్ ఉంటాయి. పర్యాటకులకు విలాసవంతమైన టూర్ అనుభవాన్ని అందించడానికి గంగా విలాస్ అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. అదేవిధంగా మ్యూజిక్, కల్చరల్ ఈవెంట్స్ , జిమ్, స్పా, అబ్జర్వేటరీ లాంటీ ప్రత్యేక కార్యక్రమాలను ప్రయాణికులు ఆస్వాదించవచ్చు. ఈ టూర్ లో ఒక్కొక్కరికి రోజుకి రూ 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు అవుతుంది. దాంతో మొత్తం 51 రోజులకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 13 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్టు క్రూయిజ్ నిర్వాహకులు తెలిపారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవీ చదవండి