Prime9

Currency: ప్రజల వద్ద రూ.30.88 లక్షల కోట్ల నగదు.. ఆర్బీఐ గణాంకాలు

Mumbai: నోటు రద్దన్నారు. నకిలీ నోట్లన్నారు. డిజిటల్ కరెన్సీలో దేశం ముందుకన్నారు. అయినా ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ప్రజల వద్ద రూ. 30.88లక్షల కోట్ల రూపాయలు నగదు రూపంలో ఉన్నట్లు ఆర్బీఐ తాజా గణాంకాలతో తెలుస్తుంది. 2016 నవంబర్ 4 నాడు ప్రజల వద్ద రూ. 17.7 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొనింది. అంటే నల్లదనాన్ని వెలికితీసే క్రమంలో కేంద్రం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రజల వద్ద మరింత ఎక్కువగా కాగితం నోట్ల నగదు చేరిందని ఇట్టే తెలిసిపోతోంది.

యూపీఐ ద్వారా నగదు రహిత పేమెంట్లు పెరిగాయని, డిజిటల్ వ్యవస్ధతో లావాదేవీలు ఊపందుకొన్నాయని కేంద్రం పదే పదే పేర్కొన్న మాటలకు తాజా నగదు గణాంకాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. సరికదా 2016-2022 మద్యలో దాదాపుగా 71.84 శాతం నగదు ప్రజల వద్దకు అదనంగా చేరడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేసేలా లెక్కలు మారాయి. కొద్ది రోజుల కిందటే డిజిటల్ రూపాయిని కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. ఎన్ని చేపట్టినా జీరో బిజినెస్ లావాదేవీలను అరికట్టడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పన్నులు చెల్లించేవారు పెదవి విరుపులు విరుస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jack Dorsey: ఉద్యోగులకు సారీ.. ట్విటర్ ఫౌండర్ జాక్ డార్సీ

Exit mobile version
Skip to toolbar