Site icon Prime9

Panjab: కార్యకర్తను పెళ్లాడిన మహిళా ఎమ్మెల్యే.. ఎక్కడంటే..?

app mla marriage party worker

app mla marriage party worker

Panjab: పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే తన పార్టీకే చెందిన కార్యకర్తను పెళ్లి చేసుకున్నారు. 28 ఏళ్ల ఎమ్మెల్యే నరిందర్ కౌర్ ఆప్ పార్టీ కార్యకర్త అయిన మణ్‌దీప్‌ సింగ్‌ను సెప్టెంబర్ 7,2022 శుక్రవారం నాడు చాలా సింపుల్ ఎటువంటి ఆర్భాటమూ లేకుండా వివాహం చేసుకున్నారు.

పంజాబ్ రాష్ట్రంలోని పటియాలాలో రోరేవాల్‌ గ్రామంలోని ఓ గురుద్వారాలో ఎమ్మెల్యే నరిందర్ కౌర్, మణ్ దీప్ సింగ్ వివాహం జరిగింది. కాగా వీరి వివాహానికి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సతీసమేతంగా హాజరయ్యి, వధూవరులను ఆశీర్వదించారు. సంగ్రూర్‌లోని భరాజ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన నరిందర్‌ కౌర్‌ పటియాలాలోని పంజాబ్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. ఈమె 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తన గ్రామంలో ఒంటరిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ బూత్‌ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో సంగ్రూర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్‌లో అతి చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నరిందర్ కౌర్ గుర్తింపు తెచ్చుకున్నారు.

మణ్‌దీప్‌ సింగ్‌ సంగ్రూర్ లోని లఖేవాల్ గ్రామానికి చెందినవాడు. మణ్ దీప్ గతంలో సంగ్రూర్‌ జిల్లా ఆప్‌ మీడియా ఇంఛార్జ్‌గా విధులు నిర్వహించారు.

ఇదీ చదవండి: ప్రేమించడం లేదని యువతిని చంపేశాడు

Exit mobile version